PM Modi Speech: దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసి..త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అదే సమయంలో పైనుంచి హెలీకాప్టర్ల ద్వారా పూలవర్షం కురిసింది. వరుసగా పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో కీలకాంశాలు ప్రస్తావించారు.
దేశ ప్రజలందరీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన ఇండియా వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని..గత పదేళ్లలో ఇండియా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. దేశం కోసం వేలాది మంది బలిదానం ఫలితమే ఇవాళ మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యమని మోదీ చెప్పారు. ప్రస్తుతం శాటిలైట్ రంగంలో ముందంజలో ఉన్న ఇండియా రానున్న కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీని శాసిస్తుందన్నారు. ఇండియాకు వరం 30 ఏళ్ల లోపు యువత అత్యధికంగా ఉండటమన్నారు.
అదే సమయంలో వ్యవసాయంలో సైతం దేశం ఇటీవలి కాలంలో చాలా అభివృద్ధి చెందిందని..సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయంలో అన్నదాతలు రాణిస్తున్నారని మోదీ తెలిపారు. బారతదేశ డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయో డైవర్శిటీలు దేశానికి బలమని మోదీ చెప్పారు. గత పదేళ్లుగా దేశంలో ఏర్పడిన సుస్థిర ప్రభుత్వం దేశాన్ని ముందుకు నడిపిస్తోందని..అంతకుముందు అవినీతి కారణంగా దేశం చాలా నష్టపోయిందన్నారు. దేశంలో అత్యధికంగా ఉన్న మహిళా శక్తి, యువతతో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని మోదీ ఆకాంక్షించారు.
కరోనా మహమ్మారి ఎన్నో పాఠాలు నేర్పిందని..ఆ సంక్షోభం నుంచి అత్యంత త్వరగా కోలుకోవడం ద్వారా ప్రపంచదేశాలకు ఇండియా ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం స్టార్టప్ రంగంలో దేశం మూడవ స్థానంలో ఉండటం విశేషమన్నారు. గత పదేళ్లలో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో అందరికీ న్యాయం చేస్తున్నామన్నారు. అందుకే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని చెప్పారు. ఈ నేపధ్యమే ఇండియాకు జీ20 నిర్వహించే అవకాశాన్ని కల్పించిందన్నారు మోదీ.
మోదీ తన ప్రసంగంలో మణిపూర్ అంశాన్ని ప్రస్తావించారు. దేశం మొత్తం మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని హామీ ఆశ్వాసన ఇచ్చారు. మణిపూర్‌లో శాంతి స్థాపనలు ప్రయత్నిస్తున్నామని..అక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చెప్పారు. శాంతితోనే మణిపూర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆ దిశగా ఆ రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొన్నిసార్లు చరిత్రలో చిన్న చిన్న సంఘటనలు దీర్ఘకాలిక విపరిణామాలకు దారితీస్తాయని వివరించారు. అన్నింటినీ సునిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమౌతాయని తెలిపారు.
ప్రపంచంలోని ఏ శక్తికీ ఇండియా భయపడదని, తలవంచదని చెప్పారు. సమున్నత లక్ష్యాలతో ఇండియా అభివృద్ధి సాధిస్తోందన్నారు. దేశ సరిహద్దుల్ని పరిరక్షించడంతో పాటు ఏ యుద్ధానికైనా దేశ సైన్యం సన్నద్ధంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఇండియా త్వరలో మూడవ ఆర్ధిక శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, వారసతక్వం, బుజ్జగింపు రాజకీయాల్ని నిర్మూలించాలని మోదీ పిలుపునిచ్చారు. టెక్నాలజీ సహాయంతో అవినీతిని అరికట్టచే ప్రయత్నం వేగంగా సాగుతోందన్నారు. 75 ఏళ్లలో గొప్ప అభివృద్ధిని సాధించామని..ఇది రెట్టింపు కావాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా అందరూ సంకల్పం తీసుకోవాలన్నారు. ఇండియా ప్రపంచ అభివృద్ధిలో కూడా కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచంలో ప్రతి దేశం ఇండియాకు మిత్రదేశమేనని గుర్తుంచుకోవాలన్నారు. అనుకున్న సమయం కంటే ముందే దేశంలో అంతర్గత జల రవాణా మార్గాల నిర్మాణం పూర్తి కానుందని చెప్పారు. రానున్న కొత్త తరానికి నూతన భారతాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Also read : ISRO New Mission: మరో భారీ ప్రయోగానికి ఇస్రో రెడీ.. తొలిసారి సూర్యడిపై అన్వేషణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook