Flying Kites on August 15: పంద్రాగస్టున గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు, దీని వెనుక ఉన్న కధేంటి

Flying Kites on August 15: పంద్రాగస్టు సమీపిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన వేళ దేశం మొత్తం మువ్వన్నెల జెండా ఎగురవేసేందుకు సిద్ధమౌతోంది. అదే సమయంలో గాలి పటాలు కూడా ఎగురవేస్తుంటారు. అయితే పంద్రాగస్టు రోజున గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 7, 2024, 04:20 PM IST
Flying Kites on August 15: పంద్రాగస్టున గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు, దీని వెనుక ఉన్న కధేంటి

Flying Kites on August 15: ఆగస్టు 15. దేశానికి స్వాతంత్య్రం లభించిన రోజు. దేశమంతా మూడు రంగుల జెండా ఆవిష్కరిస్తూ పండుగ జరుపుకుంటుంది. బ్రిటీషు తెల్లదొరల నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించిన సందర్భంగా వాడవాడలో జెండా పండుగ జరుగుతుంది. దాంతో పాటు గాలిపటాలు ఎగరేయడం కూడా ఓ ఆనవాయితీగా వస్తోంది. దానికి కారణమేంటో తెలుసుకుందాం.

వాస్తవానికి గాలిపటాలు ఎగుర వేయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ప్రాచీన సంస్కృతిలో ఓ భాగం. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం లేదా సందేశమిచ్చేందుకు ఇలా ఏదో ఒక కారణంతో గాలి పటాలు ఎగరవేస్తుంటారు. కొన్ని ప్రత్యేక పండుగల వేళ కూడా గాలిపటాలు ఎగురవేయడం గమనించవచ్చు. మొఘల్స్ కాలంలో సైతం గాలి పటాలు ఎగురవేయడం అత్యంత ప్రజాదరణ పొందింది. అదే విధంగా గాలి పటాలు ఎగురవేయడం కూడా పంద్రాగస్ఠు వేడుకల్లో ఓ భాగం. 

గాలిపటం అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో కూడా గాలిపటాలను ప్రత్యేకమైన పద్ధతిలో ఉపయోగించేవారు. 1928లో బ్రిటీషు ప్రభుత్వం ఇండియాకు సైమన్ కమీషన్ పంపించినప్పుడు దేశ ప్రజలంతా ఈ కమీషన్‌ను వ్యతిరేకించారు. ఈ కమీషన్‌లో ఒక్క భారతీయుడు కూడా లేడు. అందుకే తమ ప్రయోజనాలు ఈ కమీషన్‌కు పట్టవని దేశ ప్రజలు భావించారు. సైమన్ కమీషన్ వ్యతిరేక ప్రదర్శనలో గాలిపటాల్ని ఓ ప్రత్యేకమైన పద్ధతిలో వినియోగించారు. బ్లాక్ కలర్ గాలిపటాలపై సైమన్ గో బ్యాక్ అని రాసి ఎగురవేశారు. భారతీయులు సైమన్ కమీషన్‌ను అంగీకరించలేదనే విషయం బ్రిటీషర్లకు ఈ సందేశం ద్వారా బాగా అర్ధమైంది. ఆ సమయంలో గాలిపటాలు సంతోషం వ్యక్తం చేసేందుకు ఎగురవేయలేదు. సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా నిరసన కోసం ఉపయోగించారు. అందుకే నిరసనకు గుర్తుగా బ్లాక్ కలర్ వాడారు. తరువాత 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించడంతో సంతోషంతో మువ్వన్నెల గాలిపటాలు ఎగురవేయడం ప్రారంభించారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.

బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా భారతీయులు అప్పట్లో గాలిపటాలతో శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపారు. గాలిపటాలు ఎగురవేసే సాధారణ ప్రక్రియ కూడా దేశపు అతిపెద్ద ఉద్యమంలో భాగమైంది. భారతీయుల్లో జాతీయతను ఈ ప్రకియ మరింతగా పెంచింది.

Also read: Breast Milk Foods: మీ పాలు బిడ్డకు సరిపోవడం లేదా, ఈ 8 ఫుడ్స్ ఇవాళే డైట్‌లో చేర్చండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News