Today Gold Price August 6: మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి ధరలు ఇవే!

August 6th 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,980గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 6, 2022, 08:39 AM IST
  • పెరిగిన బంగారం ధర
  • నేటి బంగారం-వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Today Gold Price August 6: మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి ధరలు ఇవే!

Today Gold Price August 6 in Hyderabad: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటాయి. ఓరోజు రేట్లు పెరిగితే, మరో రోజు తగ్గుతాయి, ఇంకోరోజు స్థిరంగా ఉంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, డాలర్ విలువ, వివిధ దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే మహిళలు బంగారంకు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి.. ధరలు ఎంత పెరిగినా లేదా తగ్గినా వ్యాపారాలు మాత్రం జోరుగానే సాగుతాయి. 

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. 5 రోజులు క్రితం స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. 2-3 రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. శనివారం (ఆగష్టు 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 47,650లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,920లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 150.. 24 క్యారెట్ల ధరపై రూ. 1600 పెరిగాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,140గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,920గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,070 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,700.. 24 క్యారెట్ల ధర రూ. 52,040గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,980గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,980గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,650.. 24 క్యారెట్ల ధర రూ. 51,980గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 47,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,980 వద్ద కొనసాగుతోంది. 

మరోవైపు వెండి ధర కూడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 58,200లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరలో రూ. 500 పెరిగింది. నేడు (ఆగష్టు 6) హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 63,600లుగా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 63,600లుగా కొనసాగుతోంది. 

Also Read: Horoscope Today August 6th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది..  

Also Read: Telangana Rain Alert:13 జిల్లాలకు రెడ్ అలర్ట్.. తెలంగాణలో మళ్లీ వరద గండం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News