India Covid-19: 62 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 62లక్షలు దాటగా.. మరణాలు 97వేలు దాటాయి. 

Last Updated : Sep 30, 2020, 10:19 AM IST
India Covid-19: 62 లక్షలు దాటిన కరోనా కేసులు

India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 62లక్షలు దాటగా.. మరణాలు 97వేలు దాటాయి. గత 24గంటల్లో మంగళవారం ( సెప్టెంబరు 29న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 80,472 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా 1,179 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 62,25,764 కి చేరగా..  మరణాల సంఖ్య 97,497 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 51,87,826 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9,40,441 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. మంగళవారం దేశవ్యాప్తంగా 10,86,688 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 29 వరకు మొత్తం 7,41,96,729 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 83.33 శాతం ఉండగా..  మ‌ర‌ణాల రేటు 1.57 శాతంగా ఉంది.Also read: Babri Masjid demolition case: నేడే బాబ్రీ తీర్పు

Trending News