న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారిన పడిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం (జెహెచ్‌యు) ప్రకారం 6.8 లక్షలు ఉన్న రష్యాను అధిగమించి భారత్ 6.9 లక్షలకు పైగా కేసులను నమోదు చేసింది. భారత కంటే బ్రెజిల్, యుఎస్ మాత్రమే ముందు వరసలో ఉన్నాయి. బ్రెజిల్‌లో 15 లక్షలకు పైగా కేసులు, యుఎస్‌లో 28 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్ లో ఆదివారం రికార్డు స్థాయిలో 24 గంటల్లో సుమారుగా 25,000 పాజిటివ్ కేసులు, 613 మరణాలను మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. Prateeksha: అమితాబ్ ఆవేదన..
Also Read: Bomb Threat: తమిళ నటుడు విజయ్ కు బాంబు బెదిరింపు
కాగా మహారాష్ట్రలో 7,000, తమిళనాడు 4,200 ఢిల్లీలో 2,500 కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణకు భారత్ మార్చిలో ప్రపంచంలోని కఠినమైన లాక్‌డౌన్ అమలు చేసింది. అయితే ఆర్థిక కార్యకలాపాల దృష్ట్యా దశలవారీగా సడలింపులివ్వడంతో ఒక్కసారిగా భారీగా కేసులు నమోదయ్యాయి. అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించడం తప్పనిసరి చేయగా, సామూహిక సమావేశాలు నిషేధించబడ్డాయి. సామాజిక దూరాన్ని పాటించమని సూచిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రానున్నరోజుల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందని ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
Also read: Delhi: ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి ప్రారంభం
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.