India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి 8 వేల దిగువనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,145 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,45,402 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది.
కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 289 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 8,706 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినప్పటికీ.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 109 కేసులు బయటపడ్డాయి.
మరిన్ని వివరాలు..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 84,565 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.24 శాతంగా ఉంది. ఫలితంగా కరోనా యాక్టివ్ కేసులు 569 రోజుల దిగువకు చేరాయి.
కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,76,869 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్ మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.
ఇప్పటి వరకు దేశంలో 34,733,194 మందికి కరోనా సోకగా.. అందులో 3,41,71,471 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది.
వ్యాక్సినేషన్ ఇలా..
నిన్న దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 62,06,244 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,36,66,05,173 వద్దకు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 273,979,021 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,361,052 మంది మహమ్మారికి బలయ్యారు. 245,877,376 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 22,740,593 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.
Also read: Omicron scare in India: అలాంటి పరిస్థితులే వస్తే రోజుకు 14 లక్షల కరోనా కేసులు!
Also read: Covavax: కోవావాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ ఆమోదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook