క్యాబ్‌లో ప్రయాణం ఇలా..!!

'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ 3.0 నేటితో ముగియనుంది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 అమలులోకి రానుంది. ఈ క్రమంలో ఆంక్షలు సడలించి మరిన్ని కార్యకలాపాలకు అనుమతలు ఇవ్వనున్నారు.

Last Updated : May 17, 2020, 10:06 AM IST
క్యాబ్‌లో ప్రయాణం ఇలా..!!

'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ 3.0 నేటితో ముగియనుంది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 అమలులోకి రానుంది. ఈ క్రమంలో ఆంక్షలు సడలించి మరిన్ని కార్యకలాపాలకు అనుమతలు ఇవ్వనున్నారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ, ప్రయివేట్ వాహన సేవలు ఇప్పటి వరకు మూసివేసే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పాక్షికంగా రైల్వే సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. మరోవైపు రేపటి నుంచి లాక్ డౌన్ 4.0 అమలవుతున్నందున ప్రయివేట్ వాహన సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆటోలు, క్యాబ్, ట్యాక్సీ సర్వీసులు పరిమిత ఆంక్షల   మధ్య పునఃప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు తిరిగి తమ వాహనాలను రోడ్డెక్కించేందుకు వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ట్యాక్సీలను శానిటైజర్స్ తో శుభ్రం చేస్తున్నారు. అలాగే డ్రైవర్ ను, ప్రయాణీకులను వేరు చేసేలా కొత్తగా కవర్లు ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ 4.0 అమలులో ఉంటుంది కాబట్టి.. ప్రతి క్యాబ్ లో ప్రయాణీకులు వెనుక వైపు మాత్రమే కూర్చోవాలి. అలాగే పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణీకులను అనుమతిస్తారు.

 

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రఖ్యాత క్యాబ్ సంస్థ ఉబెర్..  తమ డ్రైవర్లకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రైవర్లు విధిగా మాస్క్,  ఫేస్ షీల్డ్ ధరించాలి. కారును ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా విధులకు దూరంగా ఉండాలి.  భవిష్యత్ లో ఉబెర్ క్యాబ్ సేవలు ఎలా ఉంటాయో తెలిసేలా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News