న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో తాజాగా 1,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,984కు చేరుకుంది. అదే సమయంలో కరోనా కాటుకు 50 మంది బలైపోయారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 640కి చేరుకుంది. సోషల్ డిస్టాన్సింగ్, పరిశుభ్రతే ముఖ్యమని వైద్యులు, అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా కేసులే లేని దేశాలివే..
బుధవారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌తో ఈ వివరాలు వెల్లడించింది. కరోనా సమస్యతో హాస్పత్రిలో చేరి చికిత్స పొందిన వారు 3,869 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారని ప్రకటనలో పేర్కొంది. మహారాష్ట్రలో 5,218 కరోనా కేసులు, 251 మరణాలతో దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రంగా నిలిచింది. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!
గుజరాత్‌లో 2,178 కేసులు, ఢిల్లీలో 2,156 కేసులు, రాజస్థాన్‌లో 1,659 కేసులు, తమిళనాడులో 1,596 కేసులు, మధ్యప్రదేశ్ 1,552 కేసులు, ఉత్తర్‌ప్రదేశ్ 1,294 కేసులు, తెలంగాణ 928 కేసులతో కరోనా సమస్యను ఎదుర్కొంటున్నాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలోనే దేశంలో లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగించడం తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!
‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos