Ladakh: ఇండియన్ ఆర్మీకు పినాకా రాకెట్ లాంచర్లు..చొరబాట్లకు ఇక చెల్లుచీటి

ఇండో చైనా సరిహద్దు ప్రాంతమైన లడాఖ్ లో ఇకపై చైనా చొరబాట్లకు చెల్లుచీటి పాడనుంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ. పినాకా రాకెట్ లాంచర్లను ఆరు మిలట్రీ రెజిమెంట్లకు అందించేందుకు  ఒప్పందమైంది. 

Last Updated : Sep 1, 2020, 10:43 PM IST
Ladakh: ఇండియన్ ఆర్మీకు పినాకా రాకెట్ లాంచర్లు..చొరబాట్లకు ఇక చెల్లుచీటి

ఇండో చైనా సరిహద్దు ప్రాంతమైన లడాఖ్ ( ladakh ) లో ఇకపై చైనా చొరబాట్లకు చెల్లుచీటి పాడనుంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ. పినాకా రాకెట్ లాంచర్లను ఆరు మిలట్రీ రెజిమెంట్లకు అందించేందుకు  ఒప్పందమైంది. 

ఇండియా చైనా సరిహద్దు ( Indo china border ) వివాదానికి కేంద్ర బిందువైన లడాఖ్ లో సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆరు మిలట్రీ రెజిమెంట్లకు పినాకా రాకెట్ లాంచర్లను  ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు 2 వేల 580 కోట్ల ఖర్చుతో రెండు దేశీయ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ ( TPCL ),  లార్సెన్ అండ్ టూబ్రో ( L & T ) లతో ఈ ఒప్పందాలయ్యాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ( Bharat Earth movers limited ) కూడా ఈ మెగా ప్రాజెక్టులో పార్టనర్ గా ఉండనుంది. ఈ రాకెట్ లాంచర్ల ద్వారా చైనా చొరబాట్లను నియంత్రించడానికి వీలవుతుంది. అటు భారత పాకిస్తాన్ సరిహద్దులో కూడా పినాకా రాకెట్ లాంచర్లను మొహరించనున్నారు. మొత్తం 6 రెజిమెంట్లలో 114 ఆటోమేటెడ్ లాంచ్ లు, 45 కమాండ్ పోస్టులతో పాటు ఆటోమేటెడ్ గన్ ఎయిమింగ్ అండ్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  

ఈ రెజిమెంట్లలో రాకెట్ లాంచర్ల ఏర్పాటు ద్వారా సైన్యం బలోపేతమవుతుంది. తద్వారా పాకిస్తాన్, చైైనా చొరబాట్లను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు ఇండియన్ ఆర్మీకు బలం చేకూరుతుంది. Also read: Metro Rail services: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు ఎలా ఉండనున్నాయి ?

Trending News