Clone Trains: ప్రయాణికుల కోసం మరో 40 స్పెషల్ ట్రైన్స్

కరోనావైరస్ కారణంగా మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సడలింపుల మేరకు మే నెలలో 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.

Last Updated : Sep 16, 2020, 01:01 PM IST
Clone Trains: ప్రయాణికుల కోసం మరో 40 స్పెషల్ ట్రైన్స్

Indian Railways to run 40 ‘clone’ trains from September 21: న్యూఢిల్లీ: కరోనావైరస్ (Coronavirus) కారణంగా మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సడలింపుల మేరకు మే నెలలో 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అన్‌లాక్-4 మార్గదర్శకాలతో భారత రైల్వే.. మరో 80 ప్రత్యేక రైళ్ల సర్వీసులను సెప్టెంబరు 12 నుంచి నడుపుతోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. మరో 40 ప్రత్యేక రైళ్ల (Clone Trains) ను సెప్టెంబరు 21నుంచి నడపనున్నట్లు మంగళవారం రాత్రి వెల్లడించింది. అయితే ఈ 20 జతల రైళ్ల సర్వీసులను నిర్థిష్టమార్గాల్లోనే.. అంటే భారీగా డిమాండ్ ఉన్న ప్రాంతాలకే నడపనున్నట్లు వెల్లడించింది. ఈ క్లోన్ రైళ్లన్నీ రిజర్వ్‌డ్.. కావున ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. ఈ రైళ్లకు 10 రోజుల ముందు నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఇవి కొన్ని స్టేషన్లల్లోనే ఆగుతాయని రైల్వే తెలిపింది. Also read: India: 50 లక్షలు దాటిన కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే 1,290 మంది మృతి

రైల్వే ప్రకటించిన 40స్పెషల్ రైళ్లల్లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే ట్రైన్లు కూడా ఉన్నాయి.  ఈ రెండు రైళ్లు విజయవాడ, వరంగల్ విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లోనే ఆగుతాయి.  
రైలు నెంబర్ 02787 సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు ప్రతీ రోజూ ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది. ఇక రైలు నెంబర్ 02788 దానాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది.
రైలు నెంబర్ 06509 బెంగళూరు నుంచి దానాపూర్‌కు ఉదయం 8 గంటలకు బయల్దేరుతుంది. రైలు నెంబర్ 06510 దానాపూర్ నుంచి సాయంత్రం 6.10 గంటలకు బెంగళూరు బయల్దేరుతుంది. 
Also read: Oxford COVID-19 Vaccine: క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి

Trending News