IRCTC Ticket Transfer Rules: రైల్వే ప్రయాణం చేసేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకుంటుంటాం. కానీ ఒక్కోసారి రిజర్వేషన్ చేయించుకున్నా ఏదో కారణతో ప్రయాణం నిలిచిపోతుంటుంది. ఈ సందర్భాల్లో మీ టికెట్‌ను మరొకరికి బదిలీ చేయవచ్చని మీకు తెలుసా..
మీ పేరును ఉన్న రైలు టికెట్‌ను మరొకరి పేరుపై బదిలీ చేయాలంటే దానికో ప్రక్రియ ఉంది. కన్ఫామ్ టికెట్ ఉంటే ఆ టికెట్ తీసుకుని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. ఆ తరువాత మీ ఐడీను, ఎవరి పేరుపై బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ పేరు వివరాలు, ఆ వ్యక్తి ఐడీ టికెట్ కౌంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ వ్యక్తితో మీ బంధాన్ని తెలియపరుస్తూ రాతపూర్వకంగా లెటర్ ఇవ్వాలి. ఈ వివరాలన్నీ టికెట్ కౌంటర్‌లో సబ్మిట్ చేశాక పూర్తిగా వెరిఫై చేసి మీ టికెట్ బదిలీ అవుతుంది. అయితే మీ టికెట్‌ను కుటుంబంలో కాకుండా ఇతర వ్యక్తికి బదిలీ చేయడానికి కుదరదు. కేవలం కుటుంబసభ్యులకు మాత్రమే టికెట్ బదిలీ చేసేందుకు వీలుంటుంది.
మీరు మీ టికెట్‌పై ప్రయాణం చేయలేకపోతే ఆ సమాచారాన్ని 24 గంటలు ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మీరు కోరిన మీ కుటుంబసభ్యునికి టికెట్ బదిలీ అవుతుంది. లేకపోతే ఆ టికెట్ వృధా అవుతుంది. అందుకే ఈ పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు 24 గంటల ముందే టికెట్ కౌంటర్‌కు వెళ్లి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత బదిలీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
Also read: Realme 12 Plus: 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమేరాతో Realme 12 Plus త్వరలో లాంచ్ , ఫీచర్లు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook