Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రేపు ఈ మార్గంలో విస్టాడోమ్ ట్రైన్ ప్రారంభం

Jharkhand First Vistadome Intercity Express: జార్ఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటి విస్టాడోమ్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఆరంభంకానుంది. అత్యాధునిక వసతులతో తయారు చేసిన ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం ప్రారంభించనున్నారు. వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2023, 06:04 PM IST
Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రేపు ఈ మార్గంలో విస్టాడోమ్ ట్రైన్ ప్రారంభం

Jharkhand First Vistadome Intercity Express: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రైల్వే శాఖ ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేస్తోంది. తాజాగా మరో స్పెషల్ ట్రైన్‌ను ప్రారంభించేందుకు రెడీ అయింది. 'విస్టాడోమ్' కోచ్‌తో జార్ఖండ్‌లోని మొదటి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం జెండా ఊపనుంది. విస్టాడోమ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను రేపు ప్రారంభించనున్నట్లు ఓ రైల్వే సీనియర్ అధికారి తెలిపారు. ఈ రైలులో అత్యాధునిక వసతులతో అన్ని సౌకర్యాలను కల్పించారు. కొండ ప్రాంతాల మధ్యలో ప్రకృతి అందాలను దగ్గర నుంచి సరికొత్త ప్రయాణ అనుభూతి అందనుంది. పర్వాతాలు, దట్టమైన అడువులు ప్రయాణికులను కనువిందు చేయనున్నాయి. 

విస్టా, డోమ్ అనే రెండు పదాలతో విస్టాడోమ్‌ను తీసుకున్నారు. విస్టా అంటే ల్యాండ్‌స్కేప్. డోమ్ అంటే గోపురం ఆకారంలో ఉంటుంది. అంటే గోపురం ఆకారపు రైలు నుంచి సుందరమైన ప్రకృతి దృశ్యాలను వీక్షించడమనేది అర్థం. విస్టాడోమ్ కోచ్‌లను ఎక్కువగా కొండ ప్రాంతాల సుందర దృశ్యాలను వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. 

జార్ఖండ్‌లో ప్రారంభించనున్న ఈ రైలు న్యూ గిరిదిహ్ స్టేషన్ నుంచి రాంచీ మధ్య నడుస్తుందని రైల్వే అధికారి తెలిపారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని న్యూ గిరిడి స్టేషన్ నుంచి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి, గిరిడి ఎంపీ చంద్రప్రకాశ్ చౌదరి, లోకల్ ఎమ్మెల్యే కేదార్ హజ్రా, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ ఈ రైలు ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. 

సెంట్రల్ రైల్వే హాజీపూర్ జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) బీరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఈ కొత్త ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పైకప్పుతో 'విస్టాడోమ్' కోచ్ ఉంటుందని తెలిపారు. ఇది  ప్రయాణికులకు కొత్త ప్రయాణ అనుభూతిని ఇస్తుందన్నారు. బర్కకానా జంక్షన్-మెస్రా మార్గంలో అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చని చెప్పారు. పర్వత ప్రాంతాలు, నాలుగు సొరంగాలు, అందమైన ప్రకృతి దృశ్యాల రైలు ప్రయాణం సాగుతుందన్నారు. ఈ రైలు ప్రతి రోజు ఉదయం 6:05 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 1 గంటకు న్యూ గిరిదిహ్ చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు రైలు బయలుదేరుతుందని.. రాత్రి 9.30 గంటలకు రాంచీకి చేరుకుంటుందని తెలిపారు.

Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?

Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x