Jharkhand Spanish Woman Comments On Indians: భారతీయులు మంచి మనసున్న వారని అత్యాచార స్పానిష్ బాధితురాలు పేర్కొంది. తాజాగా, ఆమె భారతీయులంతా గొప్ప మనసున్న వారని, ఇలాంటి దేశంలో టూరిస్టు ప్రదేశాలను చూడటానికి రావడం గొప్ప విషయమని అన్నారు. భారతీయులంతా గొప్పవాళ్లే అని ఆమె అన్నారు. కానీ కొందరు తప్పుడు మనుషుల వల్ల పూర్తిగా దేశాన్ని చెడుగా మాట్లాడటం కరెక్ట్ కాదని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, జార్ఖండ్ లోని దుమ్కాలో లో స్పానిష్ మహిళ, తన భర్తతో కలిసి టెంట్ లో సేదతీరుతుండగా ఏడుగురు కేటుగాళ్లు ఆమెపై దాడిచేసి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.
Read More: Deepika Padukone: వారందరికీ సమస్యగా మారిన దీపికా పడుకోణే ప్రెగ్నెన్సీ.. కారణం ఏంటంటే!
ఇదిలా ఉండగా.. జార్ఖండ్ లోని దుమ్కాలో స్పెయిన్ దేశానికి చెందిన మహిళపై జరిగిన దారుణ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మహిళ తన భర్తతో కలిసి హన్స్ దిహా ప్రాంతంలో రాత్రి పూట టెంట్ వేసుకుని రిలాక్స్ అవుతున్నారు. ఇంతలో కొందరు కామాంధులు వారిపైనదాడులకు తెగబడ్డారు. అంతేకాకుండా.. మహిళపై అత్యంత దారుణంగా దాడిచేసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో రాత్రంత దంపతులు షాకింగ్ లోనే ఉండిపోయారు. ఉదయాన్నే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనపై పోలీసులు, దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసలు వెల్లువెత్తాయి. నిందితులను పట్టుకుని కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా అనేక డిమాండ్ లు వచ్చాయి. ఈ క్రమంలో నిందితుల కోసం జల్లెడ పట్టారు. ఘటన జరిగిన కొన్ని గంటలలోనే నిందితులను కనిపెట్టారు. ఏడుగురు గ్యాంగ్ కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా పోలీసులు వెతుకుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
Read More: Healthy Drinks: పొట్టను శుభ్రం చేసే 3 డ్రింక్స్.. కేవలం 10 రోజుల్లో బరువు కూడా తగ్గొచ్చు..!
అదే విధంగా స్పెయిన్ బాధితురాలికి 10 లక్షల పరిహరం ఇచ్చినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అత్యాచారం బాధితురాలి భర్త మాట్లాడుతూ.. పోలీసులు వేగవంతమైన దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా మాట్లాడుతూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook