24 గంటల్లో 1752 కరోనా పాజిటివ్ కేసులు.. 37 మంది మృతి!

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 37 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అదే సమయంలో కొత్తగా మరో 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో శుక్రవారం రాత్రి నాటికి దేశంలో మొత్తం కొవిడ్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,452 చేరుకుంది.

Last Updated : Apr 25, 2020, 01:05 AM IST
24 గంటల్లో 1752 కరోనా  పాజిటివ్ కేసులు.. 37 మంది మృతి!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 37 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అదే సమయంలో కొత్తగా మరో 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో శుక్రవారం రాత్రి నాటికి దేశంలో మొత్తం కొవిడ్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,452 చేరుకుంది. ప్రస్తుతం 17,915 మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,813 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో చనిపోయిన 37మంది కలిపి ఇప్పటివరకు కరోనాతో 723 చనిపోయారు.

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఒకవేళ దేశంలో లాక్ డౌన్ విధించి ఉండకపోయి ఉన్నట్టయితే... ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 73,000 మందికి కరోనా  వైరస్ సోకి ఉండేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. దేశం నలుమూలల 9.45 లక్షల మంది కరోనా వైరస్ అనుమానితులపై పర్యవేక్షణ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది.

Trending News