Covid-19: దేశంలో 40లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య

భారత్‌లో కరోనావైరస్ విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి నిత్యం 90వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. బుధవారం మరలా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.

Last Updated : Sep 17, 2020, 10:32 AM IST
Covid-19: దేశంలో 40లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య

Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి నిత్యం 90వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. బుధవారం మరలా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24 గంటల్లో బుధవారం ( సెప్టెంబరు 16న ) దేశవ్యాప్తంగా కొత్తగా..  97,894 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,132 మంది మరణించారు. ఈ మేరకు గురువారం ఉదయం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51,18,254 కి చేరగా.. మరణాల సంఖ్య 83,198 కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,09,976 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 40,25,080 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read; Arjun Tendulkar: ముంబై ఇండియన్స్ జట్టులోకి సచిన్ తనయుడు

దేశంలో ఆరుకోట్లు దాటిన కరోనా పరీక్షలు..

ఇదిలాఉంటే.. బుధవారం దేశవ్యాప్తంగా 11,36,613 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 16 వరకు మొత్తం 6,05,65,728 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 78.64 శాతం ఉండగా.. మరణాల రేటు 1.63శాతం ఉంది.   IPL 2020: జట్టుతో చేరిన అరుదైన క్రికెటర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News