Food Museum Thanjavur: దేశంలో తొలి ఫుడ్ మ్యూజియం.. ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Food Museum Thanjavur: భారతదేశంలో తొలి ఫుడ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది భారత ఆహార సంస్థ. తంజావూరులోని భారత ఆహార సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ఈ మ్యూజియాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 09:44 AM IST
Food Museum Thanjavur: దేశంలో తొలి ఫుడ్ మ్యూజియం.. ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Food Museum Thanjavur: దేశంలోనే తొలి ఫుడ్ మ్యూజియాన్ని తంజావూర్‌లోని భారత ఆహార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.  కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ దీనిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. తంజావూర్‌లో జరిగిన కార్యక్రమంలో భారత ఆహార సంస్థ దక్షిణ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు తల్జిత్‌ సింగ్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌కుమార్‌ గౌతమ్‌, జనరల్‌ మేనేజర్‌ సింగ్‌ పాల్గొన్నారు.

సుమారు 1,860 అడుగుల విస్తీర్ణంలోని ఈ మ్యూజియాన్ని భారత ఆహార సంస్థ, బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్‌ అండ్‌ టెక్నాలజీ మ్యూజియం సంయుక్తంగా రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రకాల ధాన్యాల సేకరణ విధానం, సవాళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తిని వివరించేలా మోడరన్ టెక్నాలజీతో ఈ మ్యూజియాన్ని రూపొందించారు. పంట పొలాల నుంచి ప్రజల పళ్లేల వరకు ఆహార ప్రస్తావనను డిజిటల్‌ విధానంలో ప్రదర్శించే ఏర్పాటు చేశారు.

Also Read: LPG cylinder blasted: ఎల్పీజీ సిలిండర్ పేలి 17 మందికి గాయాలు, 5 ఇళ్లు ధ్వంసం

Also Read: Assam Rifles: భార్యతో ఆ జవాన్ చివరి ఫోన్ కాల్.. దాడికి కొద్ది గంటల ముందు ఏం చెప్పాడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News