రూ.400 కే గోవా టూర్ ప్యాకేజెస్.. ఐఆర్‌సీటీసీ బంపరాఫర్!

ఐఆర్‌సీటీసీ టూరిజం అందిస్తున్న గోవా టూర్ ప్యాకెజెస్ ఆఫర్స్

Last Updated : Dec 19, 2018, 08:22 PM IST
రూ.400 కే గోవా టూర్ ప్యాకేజెస్.. ఐఆర్‌సీటీసీ బంపరాఫర్!

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్‌లో టికెటింగ్ విభాగంగా పనిచేస్తున్న ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఓ బంపరాఫర్ అందిస్తోంది. ఒక్కరికి రూ.400 చొప్పున వన్డే ప్యాకేజ్ రూపొందించిన ఐఆర్‌సీటీసీ.. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులను ఒకరోజుపాటు నార్త్ గోవా లేదా దక్షిణ గోవా పర్యటనకు తీసుకెళ్లనుంది. రూ.400 కు నార్త్ గోవా లేదా సౌత్ గోవాలో పర్యటించే వీలు కల్పిస్తున్న ఐఆర్‌సీటీసీ.. ఒకవేళ ఈ రెండు ప్రాంతాల్లో పర్యటించాలనుకునేవారు ఒక్కరికి రూ.600 చొప్పున లభించే టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించింది. గోవాలో పర్యటించే పర్యాటకులకు ఈ వన్డే బస్ టూర్ ఉపయోగకరంగా ఉంటుందని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

సౌత్ గోవా పర్యటనలో డోనా పాలా, గోవా సైన్స్ మ్యూజియం, మిరమర్ బీచ్, కాలా అకాడమి, భగవాన్ మహవీర్ గార్డెన్, పంజిమ్ మార్కెట్, కెసినో పాయింట్, రివర్ బోట్ క్రూయిజ్, ఓల్డ్ గోవా, సెయింట్ కేథరిన్ చాపెల్, వైస్రాయ్ ఆర్క్, ఏఎస్ఐ మ్యూజియం, సెయింట్ అగస్టిన్ ప్రదేశాలు వున్నాయి.

Also read : ధోనిపై కపిల్ దేవ్ ప్రశంసలు.. 2019 వరల్డ్ కప్ గురించి కీలక వ్యాఖ్యలు!

ఇక నార్త్ గోవా టూర్ ప్యాకేజ్ విషయానికొస్తే, అగ్వాడా ఫోర్ట్, సింక్వెరిమ్ బీచ్, కండోలిమ్ బీచ్, సెయింట్ ఆంటోనీ చాపెల్, సెయింట్ అలెక్స్ చర్చ్, కలంగూట్ బీచ్, బగా బీచ్, అంజునా బీచ్, చాపోరా ఫోర్ట్, వెగొటర్ బీచ్ వంటి ప్రదేశాలు వున్నాయి.

సౌత్ గోవా, నార్త్ గోవా కాంబో టూర్ ప్యాకేజ్ ఎంచుకున్న వారికి పైఅన్ని ప్రదేశాలతోపాటు మాల్ డి గోవా, శాలిగాన్ చర్చ్ ప్రదేశాల్లో పర్యటించే అవకాశం కలుగుతుంది. 

Also read : మీ ఓటు హక్కు గల్లంతయ్యిందా ? ఓటర్ ఐడీ వివరాల్లో తప్పులున్నాయా ? అయితే ఇది మీకోసమే..

ఐఆర్‌సీటీసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఎవరైనా ఈ టికెట్ కొనుగోలు చేయాలనుకుంటే, అంతకన్నా కనీసం నాలుగు రోజులు ముందుగా అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకోవాల్సి వుంటుందని తెలుస్తోంది. నాలుగు రోజుల ముందే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ మూసేయనుండటమే అందుకు కారణంగా ఐఆర్‌సీటీసీ పేర్కొంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లోనూ టికెట్ బుకింగ్ అందుబాటులో వున్నట్టు ఐఆర్‌సీటీసీ స్పష్టంచేసింది. టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులకు వారి బోర్డింగ్ పాయింట్ వివరాలతో కూడిన ఈమెయిల్ పంపించడం జరుగుతుందని, పర్యటనకు వచ్చే ముందు ఆ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ప్రింట్ తీసుకుని రావాల్సి వుంటుందని తెలిపింది.

Trending News