Digital Media : టెక్ దిగ్గజ కంపెనీలతో న్యూస్ మీడియా రంగం నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటుందని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూస్ మీడియా రంగంతో కంపెనీలు పారదర్శకంగా, గొప్ప బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. బిగ్ టెక్ కంపెనీలు డిజిటల్ మీడియా ల్యాండ్‌స్కేప్‌లో చాలా కాలంగా ఆధిపత్య స్థానాన్ని ఆస్వాదిస్తున్నాయని.. న్యూస్ పబ్లిషర్లు సృష్టించిన కంటెంట్ నుండి వారికి తగిన పరిహారం ఇవ్వకుండా గణనీయమైన ఆదాయాన్ని పొందుతున్నాయన్నారు.
Union Cabinet Approves One Nation One Election Report: దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్లకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సంచలనం రేపింది. దీంతో నరేంద్ర మోదీ కలగన్న 'ఒక దేశం- ఒక ఎన్నిక' త్వరలోనే సాకారం కానుంది.
Vande Bharat Express Trains New Routes: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Vande Bharat Express Trains New Routes: G20 సదస్సు కోసం భారత్ కి వచ్చిన జి20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గాంధీనగర్ - ముంబై మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది. " వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం తమని ఎంతో ఆకట్టుకుంది " అని సదరు మీడియా ప్రతినిధుల బృందం హర్షం వ్యక్తంచేసింది.
Vande Metro Train: వందేభారత్ రైలు తరహాలో 'వందే మెట్రో' రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇవీ పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా తీసుకురాబోతున్నారు.
Concessions on Train Ticket Charges: రైలు టిక్కెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల అమలు ఎంతవరకు వచ్చిందో తెలపాల్సిందిగా కోరుతూ మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన ఆర్టిఐ యాక్టివిస్ట్ చంద్ర శేఖర్ గౌర్ సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌కి ఒక పిటిషన్ దాఖలు చేశారు.
Indian Railways: వందేభారత్ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. రైళ్ల వేగం మరింత పెరగనుంది. భవిష్యత్‌లో ఈ రైళ్లలో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
Vande Bharat Trains: వందేభారత్ రైళ్లకు సంబంధించి ఇండియన్ రైల్వే కీలకమైన అప్డేట్ ఇచ్చింది. వందేభారత్ రైళ్లు కొత్త మైలురాయిని అందుకున్నాయి. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ట్వీట్ ద్వారా వివరాలు అందించారు.
Indian Railways: భారతీయ రైల్వే మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రయాణాలు చేసే రైళ్లలో మహిళలకోసం బెర్త్‌లు రిజర్వ్ చేయనున్నట్లు తెలిపింది.
Indian Railways: ఇండియన్ రైల్వేను ప్రభుత్వం.. ప్రైవేటు పరం చేయనుందని వస్తున్న వార్తలను ఖండించారు మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Pegasus hacking: ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం ప్రముఖ రాజకీయ నేతలు, సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులను షేక్ చేస్తోంది. పెగాసస్ స్పైవేర్ ప్రస్తుతం ప్రముఖులకు నిద్ర కరువయ్యేలా చేసింది. రెండేళ్ల క్రితం పలువురు మేథావులు, నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనే వార్తా కథనాలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.