Sajjala Comments: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆమె ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. తండ్రి మరణానంతరం ఏ పార్టీ నేతలు వైఎస్ కుటుంబాన్ని అవమానపరిచారో వారితో కండువా కప్పించుకున్నారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుట్ర ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మరణంపై తమకు అనుమానాలున్నాయని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా సందేహం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం చంద్రబాబు లాంటి వ్యక్తులు ఆఖరికి కుటుంబాల్ని కూడా చీల్చుతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్‌కు మాత్రం కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని తెల్చి చెప్పారు. కుటుంబం కోసం ఆయన పార్టీ పెట్టలేదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారనే వాదన విన్పిస్తోంది. ఏపీలో మరో 3-4 నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంగా ఈ పరిణామం ఆసక్తి రేపుతోంది. ఒకవేళ వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే తమ విధానాలు తమకున్నాయని సజ్జల స్పష్టం చేశారు. ఈ మధ్యనే పార్టీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పార్టీ వీడటానికి కారణాలు తెలియవన్నారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని మాత్రం చెప్పారన్నారు.
వైఎస్ మరణంపై బహిరంగంగా ఏనాడూ ప్రకటన చేయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత వైఎస్ మరణంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందనే అనుమామముందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు డాక్టరేట్ ఆఫర్, సున్నితంగా తిరస్కరించిన జనసేనాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook