ISRO Launch: ప్రకృతి విపత్తుల్ని పసిగట్టే ఇన్సాట్ 3డీఎస్ ప్రయోగం నేడే

ISRO Launch: అంతరిక్షంలో ఇస్రో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరో ఉపగ్రహాన్ని పంపించనుంది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి మరో ఉపగ్రహం దూసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2024, 08:05 AM IST
ISRO Launch: ప్రకృతి విపత్తుల్ని పసిగట్టే ఇన్సాట్ 3డీఎస్ ప్రయోగం నేడే

ISRO Launch: ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్‌వి ఎఫ్ 14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు GSLV F14 రాకెట్ ద్వారా 3DS ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ ఏడాది 2024లో ఇస్రో ఇప్పటికే పీఎస్ఎల్‌వి సి38 విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు మరో ప్రయోగం చేయనుంది. జీఎస్ఎల్‌వి ఎఫ్ 14 రాకెట్ ద్వారా ఇన్సాట్ 3డి ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రయోగించనుంది. ఇస్రోకు ఇది 97 ప్రయోగం. భూమి నుంచి 36,7866 కిలోమీటర్ల ఎత్తులోని జియో స్టేషనరీ ఆర్బిట్‌కు చేరుకున్న తరువాత ఇన్సాట్ 3డి ఉపగ్రహం రాకెట్ నుంటి విడిపోయి అంతరిక్షంలోని భూకక్ష్యలో చేరుతుంది. అక్కడ్నించి ఆ కక్ష్యలో తిరుగుతూ నిర్దేశిత విధుల్ని నెరవేర్చుతుంది. 

ఇన్సాట్ సిరీస్‌లో ఇస్రో ఇప్పటి వరకూ పంపించిన 23 శాటిలలైట్లలో కొన్నింటి లైఫ్‌టైమ్ అయిపోవడంతో కొత్తవి పంపించాల్సి ఉంటుంది. ఇవాళ పంపిస్తున్న ఇన్సాట్ 3 డీఎస్ ఉపగ్రహం చాలా శక్తివంతమైంది. ఇది 6 ఛానెల్ ఇమేజర్, 19 ఛానెల్ సౌండర్స్, మెట్రోలాజికల్ పేలోడ్స్, కమ్యూనికేషన్ పేలోడ్స్ కలిగి ఉంటుంది. వాతావరణాన్ని అంచనా వేయడం, భూమి, సముద్ర వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ రానున్న ప్రకృతి విపత్తుల్ని ముందుగా అంచనా వేసి సంకేతాలు పంపిస్తుంది. జీఎస్ఎల్‌వి సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం.

ఇవాళ ప్రయోగిస్తున్న ఇన్సాట్ 3 డీఎస్ ఉపగ్రహాన్ని అందుకే మెట్రోలాజికల్ అండ్ డిజాస్టర్ వార్నింగ్ శాటిలైట్‌గా పిలుస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ మిషన్ ఖర్చును భరిస్తుంది. 

Also read: Sonia Assets: సోనియా గాంధీకి సొంత కారు లేదంట.. ఇక మిగతా ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News