Aditya L1 Mission: ఆదిత్య ఎల్ 1 మిషన్‌లో కీలక మైలురాయి, విజయవంతంగా దాటిన భూ గురుత్వాకర్షణ పరిధి

Aditya L1 Mission: చంద్రయాన్ 3 విజయవంతం తరువాత ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ ప్రయోగంలో కీలకమైన మైలురాయిని చేరుకుందని ఇస్రో వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 30, 2023, 10:23 PM IST
Aditya L1 Mission: ఆదిత్య ఎల్ 1 మిషన్‌లో కీలక మైలురాయి, విజయవంతంగా దాటిన భూ గురుత్వాకర్షణ పరిధి

Aditya L1 Mission: సూర్యునిపై, సౌర వాతావరణంలో పరిశోధనల నిమిత్తం ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 మిషన్‌పై ఇస్రో కీలకమైన అప్‌డేట్ విడుదల చేసింది. సూర్యుని వైపు దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్ 1 మిషన్ ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. భూమి గురుత్వాకర్షణ పరిధిని దాటి ముందుకు సాగుతుండటం విశేషం.

సూర్యునిపై పరిశోధన కోసం పంపిన ఆదిత్య ఎల్ 1 మిషన్ విజయవంతంగా దూసుకెళ్తోంది. ఆదిత్య ఎల్ 1 మిషన్‌కు సంబంధించిన కీలకమైన అప్‌డేట్‌ను ఇస్రో విడుదల చేసింది. ఇప్పటి వరకూ 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన ఆదిత్య ఎల్ 1 భూ గురుత్వాకర్షణ శక్తిని విజయవంతంగా దాటడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లాగ్రేంజియన్ పాయింట్ 1 దిశగా ఆదిత్య ఎల్ 1 పయనిస్తోంది. ఈ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే 9 లక్షల కిలోమీటర్లు పూర్తయింది. మరో 6 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తే విజయవంతంగా ఎల్ 1 పాయింట్‌కు చేరినట్టే. 

సెప్టెంబర్ 2వ తేదీన పీఎస్ఎల్‌వి సి57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 మిషన్ విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఇందులో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. ఎల్1 పాయింటా్ వద్ద భూమి, సూర్యుడికి చెందిన గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. భూ గురుత్వాకర్షణ పరిధి నుంచి ఆదిత్య ఎల్ 1 వైదొలగడమే కాకుండా నిర్దేశిత వేగంతో ఎల్ 1 పాయింట్ వైపుకు పయనిస్తోంది. 

భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటి ఓ వ్యోమనౌక విజయవంతంగా దూసుకెళ్లడం ఇస్రో చరిత్రలో ఇది రెండవసారి. గతంలో అంగారకుడిపై ప్రయోగాలు సందర్భంగా మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో భూ గురుత్వాకర్షణ పరిధి దాటింది. 

Also read: RBI Good News: ఆర్బీఐ గుడ్‌న్యూస్, 2 వేల నోటు మార్చేందుకు మరో వారం రోజులు గడువు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News