ITBP SI Recruitment 2022: ఐటీబీపీలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... అభ్యర్థుల కోసం కీలక అప్‌డేట్స్..

ITBP SI Recruitment 2022: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సబ్ ఇన్‌స్పెక్టర్ హోదా కలిగిన స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 14, 2022, 03:49 PM IST
  • ఐటీబీపీలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 పోస్టుల భర్తీ
  • నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
ITBP SI Recruitment 2022: ఐటీబీపీలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... అభ్యర్థుల కోసం కీలక అప్‌డేట్స్..

ITBP SI Recruitment 2022: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సబ్ ఇన్‌స్పెక్టర్ హోదా కలిగిన స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు  recruitment.itbpolice.nic.in వెబ్‌సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి గడువు, అప్లికేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం...

విద్యార్హత, వయో పరిమితి :

అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్తుల వయసు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అభ్యర్థులు సెప్టెంబర్ 16, 1992 కన్నా ముందు సెప్టెంబర్ 16, 2001తర్వాత జన్మించి ఉండకూడదు.

ముఖ్య తేదీలు : 

ఆగస్టు 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. సెప్టెంబర్ 17, 2022 దరఖాస్తులకు చివరి గడువు.

అప్లికేషన్ ఫీజు :

మహిళా అభ్యర్థులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. మిగతా అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.  మరిన్ని వివరాలకు recruitment.itbpolice.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ :

 శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ), శారీరక ధృఢత్వ పరీక్ష (పీఎస్‌టీ), రాతపూర్వక పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్, డీటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (ఆర్ఎంఈ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Also Read: Srinivas Goud: మంత్రి గన్ ఫైర్ చేసినా డీజీపీ మౌనం? ఆ పోస్ట్ కోసమేనంటూ బీజేపీ ఫైర్..

Also Read: తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్న చిన్నారి.. వర్షాకాలంలో జాగ్రత్త! తల్లి ధైర్యానికి వందనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News