ముంబై : ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం అక్కడ ఇంటర్‌నెట్ సేవల్ని నిలిపివేశారు. అయితే జమ్మూకాశ్మీర్‌లో ఇంటర్నెట్ నిలిపివేతపై కదాఖలైన పిటిషన్లను ఇటీవల విచారించిన సుప్రీంకోర్టు సైతం ఈ చర్యలను వ్యతిరేకించింది. జమ్మూలో ఇంటర్నెట్ ఎందుకోసం వాడతారో తెలుసా అంటూ నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అక్కడి యువత డర్టీ మూవీస్ (బూతు సినిమాలు) చూసేందుకే ఇంటర్నెట్ వినియోగిస్తుందన్నారు. ఇంటర్నెట్ వాడి బూతు వీడియోలు చూడటం తప్ప.. ఇంకేం చేయలేరని కాశ్మీర్ ప్రజలను కించపరిచేలా మాట్లాడారు.
ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇన్‌స్టిస్టూట్ స్నాతకోత్సవంలో శనివారం పాల్గొన్న వీకే సారస్వత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ యువత అసభ్య సినిమాలు చూస్తోందని, అక్కడ ఇంటర్నెట్ నిలిపివేయడం వల్ల దేశానికి వచ్చే సమస్యేమీ లేదన్నారు. ఇంటర్నెట్ ఆపి వేస్తే ఆర్టిక నష్టాలేమీ రాలేదని, నెట్ కారణంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసి నిరసనలకు ఆజ్యం పోసే అవకాశాలే ఎక్కువని అభిప్రాయపడ్డారు.
#WATCH: NITI Aayog's VK Saraswat says "...They (politicians) use social media to fuel protests. What difference does it make if there’s no internet in Kashmir? What do you watch on internet there? What e-tailing is happening? Besides watching dirty films, you do nothing. (18.01) pic.twitter.com/slz9o88oF2
— ANI (@ANI) January 19, 2020
ఇంటర్నెట్‌ను వాడుకుని కశ్మీర్‌లో సైతం ఢిల్లీలో తరహా నిరసనలు ఎక్కువ చేయాలని కొందరు రాజకీయ నాయకులు యత్నిస్తున్నారని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడంతో నష్టమేమీ జరగలేదని గుర్తించాలన్నారు. కానీ అశ్లీల వీడియోలు చూసేందుకు, నిరసనలకు ఆజ్యం పోయడానికి ఎక్కువగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని.. అలాంటి కారణాలతోనే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని వివరించారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు అనంతరం గత ఆగస్టు 5 నుంచి కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇంటర్నెట్ సేవలు మళ్లీ అందుబాటులోకి వస్తున్నాయి.
NITI Aayog's VK Saraswat: I have been quoted out of context. If this misquotation has hurt the feelings of the people of Kashmir, I apologise and would not like them to carry this impression that I am against the rights of the Kashmiris to have internet access. https://t.co/8bwfkBGk6i pic.twitter.com/jwvHaDPVg1
— ANI (@ANI) January 19, 2020
కాశ్మీరీలపై చేసిన కామెంట్ల వివాదంపై వీకే సారస్వత్ స్పందించారు. కశ్మీర్ ప్రజలకు ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై తాను చేసిన కామెంట్లు వేరే తీరుగా ప్రచారమయ్యాయని చెప్పారు. అందువల్ల కాశ్మీరీ ప్రజల మనసు నొచ్చుకునే అవకాశం ఉందన్నారు. కాశ్మీర్ ప్రజలను క్షమాపణ కోరారు. వారికి ఇంటర్నెట్ సేవల నిషేధానికి తానేమీ అనుకూలం కాదన్నారు.