Jammu Kashmir Exit Polls 2024: జమ్ము కశ్మీర్‌లో ఎడ్జ్ ఎన్‌సి-కాంగ్రెస్ కూటమికే, ఇండిపెండెంట్లు కింగ్ మేకర్లా

Jammu Kashmir Exit Polls 2024: దేశంలో అందరి చూపూ హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికలపైనే ఉంది. ఇవాళ రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకు పట్టం కడుతుంటే..జమ్ము కశ్మీర్‌లో పరిస్థితి అస్పష్టంగా కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 5, 2024, 09:53 PM IST
Jammu Kashmir Exit Polls 2024: జమ్ము కశ్మీర్‌లో ఎడ్జ్ ఎన్‌సి-కాంగ్రెస్ కూటమికే, ఇండిపెండెంట్లు కింగ్ మేకర్లా

Jammu Kashmir Exit Polls 2024: కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము కశ్మీర్‌ను ప్రకటించిన తరువాత తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. 90 స్థానాలు కలిగిన జమ్ము కశ్మీర్‌కు మూడు దశల్లో ఎన్నికలు జరగగా కావల్సిన మేజిక్ ఫిగర్ 46.

జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో  63.45 శాతం పోలింగ్ నమోదైంది. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ అలయెన్స్ 35-40 సీట్లు సాధించనున్నాయి. ఇక బీజేపీ 20-25 సీట్లు సాధించవచ్చు.  మరో 12-16 సీట్లు ఇండిపెండెంట్ అభ్యర్ధులు, 4-7 స్థానాల్ని పీడీపీ దక్కించుకోనున్నాయి. 

గులిస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ అలయెన్స్ 31-36 సీట్లు సాధించనుండగా బీజేపీ 28-30 సీట్లు సాధిస్తుంది. ఇక 19-23 సీట్లతో ఇండిపెండెంట్లు కింగ్ మేకర్‌గా నిలవనున్నారు. పీడీపీ 5-7 సీట్లకే పరిమితం కానుంది.

సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ అలయెన్స్ 30-48 సీట్లు సాధించనుండగా, బీజేపీ 27-32 సీట్లు సాధిస్తుంది. పీడీపీ 6-12 సీట్లు, ఇండిపెండెంట్లు 6-11 స్థానాలు దక్కించుకోనున్నారు. 

పీపుల్స్ పల్స్ పోల్ ఎగ్జిట్ పోల్ ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ కలిసి 46-50 సీట్లు సాధించనున్నాయి. ఇక బీజేపీ 23-27 సీట్లు దక్కించుకుంటాయి. పీడీపీ 7-11 సీట్లు, ఇండిపెండెంట్లు 6-10 సీట్లు సాధించనున్నారు. 

మెగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ అలయెన్స్ 45 స్థానాలు, బీజేపీ 27 స్థానాలు, పీడీపీ 8 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. ఇక ఇండిపెండెంట్లు 10 స్థానాలు కైవసం చేసుకోవచ్చు. మొత్తానికి ఒకటి రెండు సంస్థలు తప్ప మరేవీ కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌కు స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దాంతో ఇండిపెండెంట్లే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు. 

Also read: Haryana Exit Polls 2024: బీజేపీకు భంగపాటు, హర్యానాలో కాంగ్రెస్‌దే అధికారం ఎగ్జిట్ పోల్స్ అన్నీ హస్తానికే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News