Terror Attack in Jammu Kashmir: జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపు దాడులు చేశారు. ఉగ్రమూకల కాల్పుల్లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. పూంచ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు శుక్రవారం భారీ కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఏరియల్ మానిటరింగ్ కూడా నిర్వహిస్తున్నామని.. ఉగ్రవాదుల జాడ కోసం స్నిఫర్ డాగ్‌లను రంగంలోకి దింపినట్లు ఒక అధికారి తెలిపారు. ఈ ప్రాంతంలో రాత్రి కార్డన్ తర్వాత నేడు ఉదయం భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైందన్నారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం అదనపు బలగాలను రంగంలోకి దింపినట్లు ఆయన తెలిపారు.
గురువారం మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో సూరంకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేరా కి గాలి, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద బ్లైండ్ కర్వ్ వద్ద రెండు వాహనాల్లో సైనికులు వెళుతుండగా.. అప్పటికే అక్కడ దాక్కున్న ఉగ్రమూకలు మెరుపు వేగంగా దూసుకువచ్చి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. మొదట కొండలపై దాక్కుని ప్లాన్ వేసుకున్న ఉగ్రవాదులు.. అనంతరం ఆర్మీ వాహనాలను లక్ష్యంగా అటవీ ప్రాంతంలో నక్కి దాడులకు తెగబడ్డారు. ఎన్కౌంటర్ తర్వాత అంబులెన్స్‌ను సంఘటనా స్థలానికి పంపించారు. ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయని ఓ అధికారి తెలిపారు.
గత నెలలో రాజౌరీలోని కలకోట్‌లో ఆర్మీ ప్రత్యేక బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన జంట దాడుల్లో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2003 నుంచి 2021 మధ్య ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు, సైనికుల మధ్య అనేక ఎన్కౌంటర్లు జరిగాయి. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో 35 మందికి పైగా సైనికులు వీరమరణం పొందారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆర్మీ అధికారులు నడుం బిగించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Salaar First Review: సలార్ ఫస్ట్ రివ్యూ... అవేవీ లేకపోయినా గూస్ బంప్స్ గ్యారంటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి