లాండ్ ఆర్డర్ దృష్ట్యా అలా చేశాం

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి స్పందించారు.

Last Updated : Dec 16, 2017, 04:22 PM IST
లాండ్ ఆర్డర్ దృష్ట్యా అలా చేశాం

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి స్పందించారు. తమకు జయలలిత మృతిపై ఏర్పాటైన విచారణ కమిషన్ నుండి ఎటువంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు. చెన్నై అపోలో హాస్పిటల్ కు వచ్చినప్పుడు అమ్మ 'పరిస్థితి' విషమంగా ఉంది. కానీ రాష్ట్ర శాంతి భద్రతల దృష్ట్యా ఆమెకు జ్వరం ఉందని, త్వరలోనే కోలుకుంటుందని ప్రకటనలు చేసినట్లు వివరించారు. విచారణ కమిషన్ నుండి పిలుపు వస్తే.. జయలలిత మరణం విషయంపై అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 

Trending News