Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం సోరెన్..ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు..!

Jharkhand: జార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ నెగ్గారు. దీంతో కీలక ఘట్టం ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Sep 5, 2022, 03:01 PM IST
  • జార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితికి తెర?
  • విశ్వాస పరీక్షలో నెగ్గిన సోరెన్
  • ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు
Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం సోరెన్..ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు..!

Jharkhand: జార్ఖండ్‌లో పొలిటికల్ డ్రామా చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్షలో సత్తా చాటారు. 81 మంది సభ్యులు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో సోరెన్ సర్కార్‌కు 48 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. తనకు తాను ఓ గని లీజును కేటాయించుకున్నారని..ఇది ముమ్మాటికి నిబంధనలకు విరుద్ధమని బీజేపీ ఆరోపించింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ..సీఎం సోరెన్‌పై వేటు వేయాలని గవర్నర్, ఈసీకి ఫిర్యాదు చేసింది.

ఈనేపథ్యంలో సోరెస్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మరోవైపు ఆయనపై వేటు పడబోతోందని గతకొంతకాలం ప్రచారం జరుగుతోంది. దీంతో సంకీర్ణ ప్రభుత్వం కూలబోతోందని వార్తలు వచ్చాయి. ఈక్రమంలో జార్ఖండ్‌లో రాజకీయాలు హీటెక్కాయి. అప్రమత్తమైన సీఎం హేమంత్ సోరెన్ తన వర్గ ఎమ్మెల్యేలను రాష్ట్రాన్ని దాటించారు. విపక్ష పార్టీ బీజేపీకి ఎమ్మెల్యేలు అమ్ముడుపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 

వారినంతా ఛత్తీస్‌గడ్‌కు తరలించారు. కీలక సమయంలో ఎమ్మెల్యేలను జార్ఖండ్‌కు తరలించారు. ఈనేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఐనా గవర్నర్ రమేష్‌ బైస్‌ నుంచి స్పందన లేకపోవడంతో సోరెన్‌కు కలిసి వచ్చింది. తనకు ఉన్న ఎమ్మెల్యేల మద్దతుపై గవర్నర్‌ను కలిసి వివరించారు. దీంతో రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లే కనిపించింది. ఈక్రమంలోనే విశ్వాస పరీక్ష నిమిత్తం ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది.

సభ మొదలు కాగానే అసెంబ్లీలో బీజేపీ నిరసన తెలిపింది. విశ్వాస పరీక్ష ఓటింగ్‌కు ముందు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈసందర్భంగా సీఎం హేమంత్ సోరెన్ కీలక వ్యాఖ్యలు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిందన్నారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ ..ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారని ఆరోపించారు. 

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ధ్వంసం చేస్తోందని సీఎం సోరెన్ ఫైర్ అయ్యారు. ఈసందర్భంగా ప్రజల్లో బీజేపీపై ఉన్న అభిప్రాయాన్ని వివరించారు. దేశంలోని ప్రజలు దుస్తులు, రేషన్, నిత్యావసరాలు కొనుగోలు చేస్తుంటే..బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో మునిగిపోయిందన్నారు సోరెన్.

Also read:Rakul Preet Singh Pics: రకుల్ ప్రీత్ సింగ్ అందాల విందు.. బ్లాక్ లెహంగాలో అలా మెరిసిందిగా!

Also read:ధోనీ తప్ప ఎవరూ నాకు మెసేజ్‌లు పంపలేదు.. టీవీలలో కూర్చుని చెత్తవాగుడు వాగకండి: కోహ్లీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News