జేపీ నడ్డాకు కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్ఠానం !!

బీజేపీ పార్టీమెంటరీ బోర్డు ఈ రోజు పార్టీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది

Last Updated : Jun 17, 2019, 08:55 PM IST
జేపీ నడ్డాకు కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్ఠానం !!

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అగ్రనేతల పార్టీకి సంబంధించి కీలక  నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జేపీ నడ్డాను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు . అనంతరం నడ్డాకు  నేతలు అభినందనలు తెలిపారు . కాగా ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, రామ్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ఐదేళ్ల పాటు  బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. అమిత్ షా హోం మంత్రి  కావడంతో  బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించాలన్న అమిత్ షా విజ్ఞప్తి మేరకు ఈ పదవికి జేపీ నడ్డాను ఎంపిక చేసినట్టు రాజ్ నాథ్ తెలిపారు.   

గత మోడీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా నడ్డాను పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ సారి ఆయన్ను కేబినెట్ లోకి తీసుకోలేదు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న నడ్డా... గతంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా  పని చేశారు. ప్రస్తుతం అమిత్ షాకు వారసుడిని భావిస్తున్న కమలదళం...ఆయనకు ఈ మేరకు కీలక బాధ్యతలు అప్పగించింది.

 

 

Trending News