Karnataka Cabinet:ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలాతో సమావేశం అనంతరం కర్టాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కేబినెట్ విస్తరణ చేపట్టారు. వారంలో రోజుల క్రితం 8 మంది సభ్యులతో ఏర్పడిన కేబినెట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో 37కు చేరుకోనుంది.
మే 20వ తేదీన కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తరువాత ఇవాళ మరో 24మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంటే ఇక ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో పూర్తి స్థాయి కేబినెట్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్న ఎమ్మెల్యేల్లో హెచ్‌కే పాటిల్, కృష్ణ బైరిగౌడ, ఎన్ చెళువరయస్వామి, కే వెంకటేశ్, హెచ్‌సి మహాదేవప్ప, ఈశ్వర్ ఖండ్రే, దినేష్ గుండూరావు, క్యాతసాంద్ర ఎన్ రాజన్న, శరణబసప్ప దర్శనపూర్, శివానంద్ పాటిల్, రామప్ప బలప్ప తిమ్మాపూర్, ఎస్ఎస్ మల్లికార్జున్, శివరాజ్ సంగప్ప తంగదాగి, శరణ ప్రకాష్ రుద్రప్ప పాటిల్, మంకల్ వైద్య, లక్ష్మి హెబ్బల్ కార్, రహీమ్ ఖాన్, డి సుధాకర్, సంతోష్ లాడ్, ఎన్ఎస్ బోసిరాజు, సురేష బీఎస్, మధు బంగారప్ప, ఎంసి సుధాకర్, బీ నాగేంద్ర ఉన్నారు.
ఇందులో లక్ష్మీ హెబ్బల్కర్, మధు బంగారప్ప, డి శుధాకర్, చెళువరయ స్వామి, మంకుల్ వైద్య, ఎంసి సుధాకర్‌లు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సన్నిహితులు. కాంగ్రెస్ పార్టీ 37 మందితో కూడిన కేబినెట్లో 6 మంది లింగాయత్‌లకు 4 మంది వగ్గలిగాలకు స్థానం కల్పించింది. ముగ్గురు షెడ్యూల్ కులానికి చెందినవారు కాగా ఇద్దరు షెడ్యూల్ తెగకు చెందినవారు. ఐదుగురు బీసీ సామాజికవర్గానికి చెందినవారు. ఇక దినేష్ గుండూరావు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత. మరో ఇద్దరు ముస్లిం మైనార్టీలకు చెందినవారున్నారు.
పాత మైసూరు, కళ్యాణ కర్ణాటక ప్రాంతాల నుంచి ఆరుగురు మంత్రులున్నారు. కిట్టూర్ కర్ణాటక నుంచి మరో ఆరుగురు ఉన్నారు. కాగా ఇద్దరు సెంట్రల్ కర్ణాటక నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు. సిద్ఱరామయ్య మంత్రివర్గంలో కులాలు, మతాల సమతుల్యత ఉంది. ఇంకా మంత్రులకు శాఖల కేటాయింపు జరగలేదు. ఇవాళ సాయంత్రానికి ఎవరికి ఏ శాఖల కేటాయింపనేది తేలనుంది.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ గత మూడ్రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. పార్టీ అధిష్టానంతో మంత్రివర్గకూర్పుపై చర్చించారు. ఏఐసీసీ పెద్దలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలాతో చాలా సేపు మంతనాలు, తర్జన భర్జనల అనంతరం మంత్రివర్గం ఓకే అయింది. కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాందీలు కేబినెట్‌పై తుది ఆమోద ముద్ర వేశారు. కర్టాటకలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సోనియా గాంధీని తొలిసారిగా కలిశారు. మంత్రివర్గంలో పేర్ల ఖరారుపై డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య అభిప్రాయబేధాలున్నా చర్చల సందర్భంగా అన్నీ పరిష్కారమయ్యాయి.
Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook