Karnataka: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందనే ఆనందం ఎంతోసేపు నిలవడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరం కల్గిస్తోంది. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీ చర్యలకు దిగుతోంది.
దేశంలో కేరళ, మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా వైరస్(Corona Virus) కేసుల ప్రభావం పొరుగు రాష్ట్రం కర్ణాటకపై పడుతోంది. గత కొద్దిరోజులుగా కర్ణాటకలో మరోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 18 వందల కరోనా కేసులు నమోదయ్యాయి. అటు 36 మంది మరణించారు. 1854 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. బెంగళారులో కరోనా ధర్డ్‌వేవ్(Corona Third Wave) ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత కొద్దిరోజుల్నించి కంటోన్మెంట్ జోన్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 80 అపార్ట్‌మెంట్లను సీజ్ చేయడంతోపాటు 777 మైక్రో కంటైన్మెంట్ జోన్లను గుర్తించారు. ఇందులో 157 ప్రాంతాల్లో కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి.
ఈ నేపధ్యంలో వైరస్ నియంత్రణకు కఠినమైన ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై(Basavaraju bommai)..అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర, కేరళ సరిహద్దు జిల్లాల్లో ప్రస్తుతమున్న నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూ(Night Curfew) వేళల్ని మార్పు చేసింది. రాత్రి 10 గంటల నుంచి కాకుండా 9 గంటల నుంచే కర్ఫ్యూ ప్రారంభం కానుంది. ఇక 9 నుంచి 12వ తరగతి వరకూ స్కూల్స్, కళాశాలల్ని రోజు విడిచి రోడు నిర్వహించనున్నారు.
Also read: వేసవిని తలపిస్తున్న ఎండలు, మరో వారం రోజులు తప్పదంటున్న వాతావరణ శాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook