కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి ప్రకటన

కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల 

Last Updated : Aug 1, 2018, 01:26 PM IST
కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి ప్రకటన

డీఎంకే అధినేత, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి ఇంకొంత కాలంపాటు ఇక్కడే ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని కావేరి ఆస్పత్రి వర్గాలు స్పష్టంచేశాయి. కరుణానిధి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కావేరి ఆస్పత్రి వర్గాలు.. వయసు పైబడటంతో తలెత్తిన ఆరోగ్య సమస్యలతో కరుణానిధి బాధపడుతున్నట్టు అందులో పేర్కొన్నాయి. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కరుణానిధి ఆరోగ్యం అంతకంతకూ విషమిస్తోందంటూ వెలువడుతున్న వార్తలు పార్టీ వర్గాలు, అభిమానులను ఆందోళనకు గురిచేస్తోన్న నేపథ్యంలో కావేరి ఆస్పత్రి వర్గాలు ఈ ప్రకటన విడుదల చేశాయి. 

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం కావేరి ఆస్పత్రికి వెళ్లి కరుణానిధిని పరామర్శించారు.

Trending News