#ZeeIndiaConclave: శ్రీరాముడితో నాకూ అనుబంధం ఉంది: కాశ్మీర్ మాజీ సీఎం

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, జీ ఇండియా కాన్‌క్లేవ్ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Mar 18, 2018, 06:23 AM IST
#ZeeIndiaConclave: శ్రీరాముడితో నాకూ అనుబంధం ఉంది: కాశ్మీర్ మాజీ సీఎం

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, జీ ఇండియా కాన్‌క్లేవ్ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీరు భారతదేశంలో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే భారతదేశానికి పాకిస్తాన్ లేదా జాతివ్యతిరేక శక్తులు.. ఈ రెండింటిలో దేనివలన ఎక్కువ ప్రమాదం ఉందన్న ప్రశ్నకు కూడా జవాబిచ్చారు. ఈ రెండూ దేశానికి ప్రమాదేమని ఆయన తెలిపారు.

అయితే.. అంతర్గతంగా ఏర్పడుతున్న కలహాలు ఎక్కువ ప్రమాదమని ఆయన చెప్పడం గమనార్హం. వీటిని ఎదుర్కోవాలని ఆయన సూచించారు. విభజించి పాలించు అనే సూత్రాన్ని అందరూ మనసుతో ఆలోచించాలని.. దానికి తాను కట్టుబడి ఉన్నానని ఫరూఖ్ అబ్దుల్లా తెలిపారు. కాశ్మీరు పండిట్లు పాకిస్తాన్ నుండి భారతదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నానని అబ్దుల్లా చెబుతూ.. ఆక్రమిత కాశ్మీరుని భారత్ వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించకూడదని అన్నారు.

పాకిస్తానీయులలో కూడా చాలామంది భారతీయులను ప్రేమించే వ్యక్తులు ఉన్నారని.. హిందువైనా..ముస్లింమైనా.. సంఘవ్యతిరేక శక్తులకు సహకరించకూడదని అబ్దుల్లా అన్నారు. తన ప్రసంగాన్ని "మోరే రామ్" గీతంతో ముగించిన అబ్దుల్లా మాట్లాడుతూ.. తాను ముస్లిమైనా ..హిందువుల దేవుడైన శ్రీరాముడితో కూడా ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.

Trending News