Haryana Election Result 2024: 2024 లోక్ సబ సార్వత్రిక ఎన్నికల తర్వాత జమ్మూ కశ్మీర్ తో పాటు హరియాణా ఎన్నికలపై అందరీ దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ఎన్నికల్లో అన్నిఎగ్జిట్ పోల్స్ సర్వేలు ముఖ్యంగా హరియాణా రాష్ట్రంలో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదని చెప్పారు. కానీ అనూహ్యంగా ఎన్నికల ఫలితాలు చూస్తే హర్యానాలో బీజేపీ తన పట్టు నిలబెట్టుకున్నట్టు తెలుస్తుంది.
Haryana JK Results 2024: దేశమంతా ఆసక్తిగా గమనించిన జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు జమ్ము కశ్మీర్లో కన్పిస్తుంటే హర్యానాలో పోటీ హోరాహోరీగా ఉంది. హర్యానాలో రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. జమ్ము కశ్మీర్లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ జోరు కన్పిస్తోంది.
Jammu Kashmir & Haryan Election Results: దేశంలో అందరి చూపూ హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత జరిగిన తొలి ఎన్నికలు. మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఈ నెల 5న ఎన్నికల ముగిసాయి. ఈ నేపథ్యంలో నేడు ఎలక్షన్స్ కమిషన్ ఈ రెండో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నాయి.
Jammu Kashmir Assembly Elections: జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి రెండు దశల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా జరగుతున్న మూడో విడత భాగంగా పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కను వినియోగించుకుంటున్నారు.
Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ‘ఆర్టికల్ 370’ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్, లడ్డాక్ గా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా
విడిపోయింది. అయితే.. దాదాపు 10 యేళ్లు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నగారా మోగింది. నాలుగు విడతలుగా జరగుతున్న ఈ ఎన్నికల్లో తొలి విడత ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
జమ్మూకశ్మీర్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్ తో రాజకీయపార్టీలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలు ఏకమై..పీపుల్స్ అలయెన్స్ గా ఏర్పడ్డాయి.
జమ్మూ కాశ్మీర్ లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ( National conference leader ) కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి సంచలనం రేపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.