Kerala Land slide: కొండచరియలు విరిగిపడి 19 మంది సజీవసమాధి.. శిథిలాల కింద చిక్కుకున్న వందలమంది..!

Kerala Wayanad Land slide: కేరళ వాయనాడ్‌లోని మొప్పాడి‌ గ్రామ ప్రాంతాల్లో కొండచరియలు మంగళవారం తెల్లవారుజామున విరిగి పడ్డాయి. ప్రకృతి ప్రకోపానికి వందలమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. భారీగా ఆస్తి నష్టం కూడా అయ్యింది.

Written by - Renuka Godugu | Last Updated : Jul 30, 2024, 08:54 AM IST
Kerala Land slide: కొండచరియలు విరిగిపడి 19 మంది సజీవసమాధి.. శిథిలాల కింద చిక్కుకున్న వందలమంది..!

Kerala Wayanad Land slide: భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తోంది. కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటి వరకు అధికారికంగా 19 మంది మృతిచెందారు. అయితే, శిథిలాల కింద 100 మందిపైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు మొదలు పెట్టాయి.

కేరళ వాయనాడ్‌లోని మొప్పాడి‌ గ్రామ ప్రాంతాల్లో కొండచరియలు మంగళవారం తెల్లవారుజామున విరిగి పడ్డాయి. ప్రకృతి ప్రకోపానికి వందలమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. భారీగా ఆస్తి నష్టం కూడా అయ్యింది. ఎన్నో వందల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనలో 19 మృతదేహాలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీయగా ఇంకా వందలాది మంచి ఆ శిథిలాల కిందే చిక్కుకున్నారు.

ఇదీ చదవండి:  ఢిల్లీ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన శివసేన ఎంపీ..

విషయం తెలుసుకున్న డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి కూడా మృతి చెందింది. అయితే, భారీ వర్షం కారణంగానే కొండచరియలు విరిగి పడ్డాయి. సగం చుర్మూర్‌ తుడిచిపెట్టుకోపోయింది. నిద్రలోనే ఆయువు కూడా పోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: పర్యాటకులకు స్వర్గమే, వర్షాకాలంలో తప్పక సందర్శించాల్సిన 5 అందమైన హిల్ స్టేషన్లు

ఈ దుర్ఘటనలో చుర్మాల్ గ్రామంలోని వందలాది ఇళ్లు, వాహనాలు నీటమునిగిపోయాయి. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతోంది. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. అన్ని ప్రభుత్వ సంస్థలతో కలిపి పనిచేస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. రెండు MI-17 హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగనున్నాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News