Kerala schools: కేరళ సర్కారు సంచలన నిర్ణయం.. ఇకపై అన్ని పాఠశాలల్లో 'వాటర్‌ బ్రేక్‌'..

Kerala news: కేరళ ప్రభుత్వ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో వాటర్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2024, 07:54 PM IST
Kerala schools: కేరళ సర్కారు సంచలన నిర్ణయం.. ఇకపై అన్ని పాఠశాలల్లో 'వాటర్‌ బ్రేక్‌'..

Kerala schools: రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ సర్కారు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. స్కూల్స్ లో విద్యార్థులకు లంచ్ బ్రేక్ లాగా.. ఇకపై వాటర్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్‌ బారిన పడకుండా.. తగినంత నీరు తాగేలా చూడాలనే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం పాఠశాలల్లో "వాటర్-బెల్" విధానాన్ని అమలుచేయాలని యోచిస్తోంది. దేశంలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. 

2019లో దేశంలో తొలిసారి ఈ విధానాన్ని కేరళలోని కొన్ని పాఠశాలల్లో ప్రారంభించామని  రాష్ట్ర విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయం తెలిపింది. అనంతరం ఈ విధానాన్ని కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం అమలుచేశాయని పేర్కొంది. దీనిని పరిగణలోకి తీసుకొని ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో అమలుచేయాలని చూస్తోంది. 

ఇందులో భాగంగా.. పాఠశాలల్లో ఉదయం 10.30, మధ్యాహ్నం 2.30 గంటలకు ఐదు నిమిషాల పాటు విద్యార్థులకు వాటర్ బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది పిల్లల్లో డీహైడ్రేషన్, ఇతర అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ఫలితంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయని.. అందువల్ల పిల్లలు పాఠశాల సమయాల్లో తగినంత నీరు వినియోగించేలా చూడాలని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

మరోవైపు కేరళ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిర్వహణ అథారిటీ (కేఎస్‌డీఎంఏ) కన్నూరు, కొట్టాయం, కోజికోడ్, అలప్పుజ జిల్లాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలను సూచిస్తూ హెచ్చరిక జారీ చేసింది. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు సూచించింది.

Also Read: Viral Video: ఢిల్లీలో షాకింగ్ ఘటన.. పట్టాలు తప్పిన రైలు.. 8 బోగీలు బోల్తా.. వైరల్ గా మారిన ఘటన..

Also Read; EPFO Bans Paytm: పేటీఎం లావాదేవీల్ని నిషేధించిన ఈపీఎఫ్ఓ, బ్యాంక్ ఎక్కౌంట్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ఎలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News