అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి చెంప చెళ్లుమనిపించిన ఖుష్బూ

అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి చెంప చెళ్లుమనిపించిన ఖుష్బూ

Last Updated : Apr 11, 2019, 05:51 PM IST
అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి చెంప చెళ్లుమనిపించిన ఖుష్బూ

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న ప్రముఖ సినీ నటి ఖుష్బూకు ఓ ఎన్నికల ర్యాలీలో అనుకోని చేధు అనుభవం ఎదురైంది. అయితే, అలాగని ఆమేం నిస్సహాయురాలిగా చూస్తూ ఊరుకోలేదు. అపరకాళీలా వెంటనే వెనుతిరిగి తన చెయ్యితోనే ఘాటైన సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందనే కదా మీ డౌట్... అక్కడికే వస్తున్నాం. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించేందుకు వెళ్లి ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఖుష్బూను ఓ యువకుడు అసభ్యంగా తాకపోయాడు. అది గమనించిన ఖుష్బూ వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి అతడి చెంప చెళ్లుమనిపించారు.

ఖుష్బూ సుందర్ రియాక్షన్‌ను చూసి ఏం జరిగిందో అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే ఆ యువకుడిని అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లి తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసి అందరూ ఖుష్బూ సాహసాన్ని అభినందిస్తున్నారు. తనను వేధించబోయిన యువకుడిపై ఆమె తిరుగుబాటు చేసిన తీరును నెటిజెన్స్ ప్రశంసిస్తున్నారు.

 

Trending News