అమెరికా-చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్ : భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్లు

    n

Last Updated : Sep 17, 2018, 09:02 PM IST
అమెరికా-చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్ : భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాన్ని చవిచూశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 505 పాయింట్లు పతనమై 37 వేల 585కు పడిపోయింది.  నిఫ్టీ విషయానికి వస్తే 137 పాయింట్లు కోల్పోయి 11 వేల 377కు దిగజారింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ల్ చరిత్రలో ఈ రోజు మరో బ్లాక్ మండేగా నిలిచింది. గత సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు ఇదే స్థాయిలో భారీ నష్టాన్ని చవిచూడటం గమనార్హం.

పతనానికి కారణాలు ఇవే...

రూపాయి విలువ పతనం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాల ప్రభావం మార్కెట్లపై పడింది. దీనికి తోడు దిగుమతులను నిషేధిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన కూడా ఇన్వెస్టర్లపై ప్రభావం చూపింది. ఈ రోజు ట్రేడింగ్ లో మొత్తం 957 కంపెనీలు నష్టాలను మూటకట్టుకోగా... 796 కంపెనీలు లాభాలను చవిచూశాయి. 

నష్టపోయిన జాబితాలో ప్రముఖ సంస్థలు
రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ ,  హీరోమోటో కార్ప్, ఎస్‌బీఐ , యాక్సిస్ బ్యాంకు, యస్‌బ్యాంకు  తదితర పెద్ద సంస్థలు 1 నుంచి 3 శాతం వరకు నష్టపోవడం గమనార్హం. 

Trending News