Independence Day 2024 Celebrations: అంబరాన్ని అంటిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు..

Independence Day 2024 Live Updates: ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఊరు వాడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

Written by - Ashok Krindinti | Last Updated : Aug 15, 2024, 08:37 AM IST
Independence Day 2024 Celebrations: అంబరాన్ని అంటిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు..
Live Blog

Independence Day 2024 Live Updates: ‘వికసిత్ భారత్’థీమ్‌తో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగురవేశారు. వరుసగా 11వ సారి ఆయన ప్రధానిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇప్పటివరకు అత్యధికంగా 17 సార్లు జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ మొదటిస్థానంలో ఉన్నారు. ఆ తరువాత ఇందిరాగాంధీ 16 సార్లు ఎగురవేసి మూడోస్థానంలో ఉన్నారు. ఇప్పుడు మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అధికమించి మూడోస్థానంలోకి వచ్చారు. ఈ ఏడాది వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దాదాపు 6 వేల మంది అతిథులను ఆహ్వానించారు.  అనంతరం జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. 

 

15 August, 2024

  • 08:37 AM

    PM Narendra Modi Speech Live: ప్రజలు మాకు పెద్ద బాధ్యత ఇచ్చారు. దేశంలో పెద్ద సంస్కరణలను ప్రవేశపెట్టాం. నేను దేశ ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. సంస్కరణల పట్ల మా నిబద్ధత గులాబీ పేపర్ సంపాదకీయాలకే పరిమితం కాదు. దేశాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చాం. మేము రాజకీయాల కోసం సంస్కరణలు చేయలేదు. మాకు ఒకే ఒక సంకల్పం ఉంది-నేషన్ ఫస్ట్.." అని మోదీ అన్నారు.

  • 08:32 AM

    PM Narendra Modi Speech Live: భారత్‌ను త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, యువత నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

  • 08:21 AM

    PM Narendra Modi Speech Live: ఈ రోజు దేశం కోసం త్యాగాలు చేసిన 'ఆజాదీ కే దీవానే'కి నివాళులు అర్పించే రోజు అని.. ఈ దేశం వారికి రుణపడి ఉంటుందన్నారు ప్రధాని మోదీ.

  • 08:18 AM

    PM Narendra Modi Speech Live: గత కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక మంది తమ కుటుంబ సభ్యులను, ఆస్తులను కోల్పోయారని.. దేశం కూడా నష్టపోయిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంక్షోభ సమయంలో వారందరికీ దేశం వారికి అండగా ఉంటుందని హామీ ఇస్తున్నానని చెప్పారు.

  • 08:12 AM

    PM Narendra Modi Speech Live: 'వికసిత్ భారత్ 2047' అంటే కేవలం పదాలు కాదని.. 140 కోట్ల మంది ప్రజల సంకల్పం, కలలకు ప్రతిబింబమని అన్నారు.

  • 08:05 AM

    PM Narendra Modi Speech Live: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “మన సంకల్పంతో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలం” అని అన్నారు.
     

Trending News