Lok Sabha Speaker Election: ఈ నెల 26న లోక సభ స్పీకర్ ఎన్నిక.. చిన్నమ్మకు చాన్స్ దక్కేనా..?

Lok Sabha Speaker: తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో మాదిరి సొంతంగా కాకుండా మిత్ర పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ప్రధాన మంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం  చేసారు. ఆయనతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ  నెల 24న కొత్త లోక్ సభ కొలువు తీరనుంది. అంతేకాదు లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఉంటుందని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 14, 2024, 10:37 AM IST
Lok Sabha Speaker Election: ఈ నెల 26న లోక సభ స్పీకర్ ఎన్నిక.. చిన్నమ్మకు చాన్స్ దక్కేనా..?

Lok Sabha Speaker: 2024లో 18వ లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ కూటమి ముందుగా చెప్పినట్టుగా 400 సీట్లు  రాలేదు. కేవలం 292 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్టీయే కూటమి తరుపున నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో పాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. అందులో 30 మంది క్యాబినేట్ మంత్రులుగా.. 5 స్వతంత్య్ర హోదా క్యాబినేట్ మంత్రులుగా.. 35 మంది కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇక కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 25న లోక్ సభ స్పీకర్ పదవికి సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు. పోటీలో ఒకటి కంటే ఎక్కువ మంది ఉంటే లోక్ సభ స్పీకర్ కు  సంబంధించి ఎన్నిక జరగుతుంది. లేకపోతే.. అదే రోజు కొత్త స్పీకర్ ఎవరనేది ప్రకటించనున్నారు.

18వ లోక్ సభ స్పీకర్ గా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో పురంధేశ్వరికి కేంద్ర కేబినేట్ లో చోటు దక్కలేదు. ఏపీలో టీడీపీ తరుపున ఆమె సామాజిక వర్గం నుంచి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేబినేట్ లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరికి మోడీ క్యాబినేట్ లో చోటు దక్కకుండా పోయింది.  మరి ప్రధాన మంత్రి మదిలో ఎవరున్నారనేది చూడాలి. ఏది ఏమైనా కొత్త లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి ఎన్నిక అవుతుందా లేదా వేరే లోక్ సభ సభ్యుడిని స్పీకర్ గా ఎన్నుకుంటారా లేదా అనేది చూడాలి. ఒకవేళ పురంధేశ్వరి అయితే.. అయ్యదేవర కాళేశ్వరరావు, నీలం సంజీవి రెడ్డి, బాలయోగిల తరవాత లోక్ సభ స్పీకర్ పదవి చేపట్టనున్న నాల్గో తెలుగు వ్యక్తిగా పురంధేశ్వరి నిలువ నుంది. మరోవైపు మీరా కుమార్, సుమిత్రా మహాజన్ ల తర్వాత మూడో మహిళ స్పీకర్ గా పురంధేశ్వరి నిలవనున్నారు. మరి చిన్నమ్మకు ఈ ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది చూడాలి.

ఇక లోక్  సభ సమావేశాలు ఈ నెల 24 నుంచి 3 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత వాయిదా పడ్డ తర్వాత జూలై చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్ లోనే లోక్ సభలో ఓటాన్ అకౌంట్ స్థానంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. వరుసగా ఆరోసారి లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేతగా నిర్మలా సీతారామన్ నిలువనున్నారు.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News