Madhya Pradesh: ఆ ఎక్స్‌ప్రెస్ వేకు వాజ్‌పేయి పేరు

భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బీహారీ వాజ్‌పేయి ( Atal Bihari Vajpayee ) రెండో వర్ధంతి సందర్భంగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Last Updated : Aug 16, 2020, 02:40 PM IST
Madhya Pradesh: ఆ ఎక్స్‌ప్రెస్ వేకు వాజ్‌పేయి పేరు

Gwalior Chambal expressway name changed: భోపాల్: భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి ( Atal Bihari Vajpayee ) రెండో వర్ధంతి సందర్భంగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్-చంబల్ ఎక్స్‌ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ( Shivraj Singh Chouhan ) ఆదివారం తెలిపారు. ఇప్పటినుంచి ఈ ఎక్స్‌ప్రెస్ వేను శ్రీ అటల్ బీహారీ వాజ్‌పేయి చంబల్ ప్రోగ్రెస్ వేగా పిలవనున్నట్లు చౌహాన్ పేర్కొన్నారు. Also read: Vajpayee Death Anniversary: వాజ్‌పేయికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా ఘన నివాళులు

వాజ్‌పేయి రెండో వర్ధంతి సందర్భంగా భోపాల్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్‌పేయి స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేస్తుందని చౌహాన్ పేర్కొన్నారు. Also read: MS Dhoni retirement: సాక్షి ఎమోషనల్ పోస్ట్

Trending News