ఒకేసారి Love Marriage, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడు

ప్రేమికులకు ఎదురయ్యే సమస్యే ఓ యువకుడికి ఎదురైంది. కానీ చివరికి ఆ పెళ్లి (Man Marries Girlfriend And Bride) సినిమా సీన్లను తలపించింది. పెళ్లికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. విషయం వైరల్‌గా మారడంతో లాక్‌డౌన్ రూల్స్‌తో పాటు చాలా నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు చెబుతున్నారు. 

Last Updated : Jul 13, 2020, 04:09 PM IST
ఒకేసారి Love Marriage, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడు

Viral Marriage | ప్రేమించిన చాలా మందికి వచ్చే సమస్య.. లవ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్లు వేరే సంబంధం చూడటం. కచ్చితంగా తాము చూసిన అబ్బాయి/అమ్మాయినే పెళ్లి చేసుకుని తీరాలని తల్లిదండ్రులు బలవంతం చేస్తారు. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇదే సమస్య ఎదురుకాగా, చివరికి తన పంతాన్ని నెరవేర్చుకోవడంతో పాటుగా తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాడు. అదేనండీ.. ప్రేమించిన యువతితో పాటు తనకు సంబంధం కుదిరిన అమ్మాయి మెడలోనూ మూడు ముళ్లు వేసి (Man Marries Girlfriend And Bride) ఏడు, ఏడు మొత్తం 14 అడుగులు నడిచాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో ఇటీవల ఈ ఘటన జరిగింది. Photos: జబర్దస్త్ యాంకర్ అనసూయ హొయలు

ఘోడాడోంగ్రి తెగకు చెందిన యువకుడు సందీప్ ఉయికే రాజధాని భోపాల్‌లో చదువుకునే రోజుల్లో హోషంగాబాద్‌కు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో సందీప్ తల్లిదండ్రులు కోయలరీ గ్రామానికి చెందిన మరో యువతితో పెళ్లి నిశ్చయించారు. అయితే తాను ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకుంటానని సందీప్ తేల్చి చెప్పాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు.   వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

ప్రియురాలినే పెళ్లి చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని సందీప్ తేల్చి చెప్పేశాడు. పెళ్లి కుదరిన అమ్మాయి, సందీప్ ప్రియురాలు ఈ విషయంలో తగ్గలేదు. చివరగా సందీప్‌తో జీవితాన్ని కలిసి పంచుకుంటామని ఇద్దరు యువతులు ఒప్పుకున్నారు. దీంతో చేసేదేమీలేక వరుడు సందీప్ తన ప్రియురాలి (Love Marriage)తో పాటు, తల్లిదండ్రులు చూసిన యువతి మెడలోనూ ఒకేసారి మూడుముళ్లు వేశాడు. జులై 8న జరిగిన ఈ వెరైటీ మ్యారేజీ హాట్ టాపిక్‌గా మారింది. వైరల్‌గా మారిన Ruhi Singh hot photos

స్పందించిన అధికారులు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడుకలకు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ఘోడాడోంగ్రి తహసీల్దార్ మోనికా విశ్వకర్మ అన్నారు. అయితే ఆ పెళ్లికి ఏ అనుమతి తీసుకోలేదని, ఇద్దరితో వివాహం ఎలా జరిపించారన్నదానిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.  

ముగ్గురికి ఓకే... 
ఘోడాడోంగ్రీ పంచాయతీ ఉప సర్పంచ్ (వైస్ ప్రెసిడెంట్) మిశ్రీలాల్ పరాటే సమక్షంలో ఆ వివాహం జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఆ ముగ్గురికి ఏ అభ్యంతరం లేదని చెప్పడంతో పెళ్లికి ఆటంకాలు తొలగిపోయాయని చెప్పారు.  RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x