మధ్యప్రదేశ్‌ ఎన్నికలు: తొలిసారిగా వీవీపీఏటీ పద్ధతిలో ముగిసిన ఓటింగ్

మధ్యప్రదేశ్‌ ఎన్నికలు: 75 శాతం ఓటింగ్ నమోదు 

Last Updated : Nov 28, 2018, 10:25 PM IST
మధ్యప్రదేశ్‌ ఎన్నికలు: తొలిసారిగా వీవీపీఏటీ పద్ధతిలో ముగిసిన ఓటింగ్

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నేడు 230 అసెంబ్లీ స్థానాల‌కుగాను జరిగిన ఎన్నిక‌లు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యప్రదేశ్‌లో తొలిసారిగా వీవీపీఏటీ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీఎల్ కాంతారావు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 75 శాతం ఓటింగ్ జ‌రిగిన‌ట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. గత 2013 అసెంబ్లీ ఎన్నిక‌ల‌్లో 72.7 శాతం నమోదు కాగా ఈసారి ఓటర్ల నుంచి అంతకన్నా ఇంకొంత ఎక్కువ స్పందనే కనిపించిందని ఈసీ తెలిపింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 2003 నుంచి బీజేపీ అధికారంలో ఉండగా 2005 తర్వాత నుంచి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సీఎం హోదాలో కొనసాగుతూ వస్తున్నారు. నాలుగోసారి కూడా తమ పార్టీనే అధికారంలోకొస్తుందని శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తంచేశారు. 

ఇదిలావుంటే, వరుసగా మూడుసార్లు రాష్ట్రాన్ని పాలించిన బీజేపీపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, అదే వ్యతిరేకత తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. 

Trending News