Maha Shivratri puja : మహా శివరాత్రి అంటే ఏంటి ? శివుడినే ఎందుకు ఆరాధిస్తారు ? ఏ మంత్రం జపిస్తే మంచిది ?

మహా శివరాత్రి అంటే ఏంటి ? ఎందుకు జరుపుకుంటారు ? ఏ మంత్రం జపిస్తే మంచిది ? శివ పంచాక్షరీ మంత్రం ఓం నమ:శివాయలోని ఐదు బీజాక్షరాల్లోని ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంది. ఆ అక్షరాల వెనుకున్న పరమార్థం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. 

Last Updated : Feb 21, 2020, 05:07 PM IST
Maha Shivratri puja : మహా శివరాత్రి అంటే ఏంటి ? శివుడినే ఎందుకు ఆరాధిస్తారు ? ఏ మంత్రం జపిస్తే మంచిది ?

శివ అనగా మంగళకరం, శుభప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన, శుభప్రదమైన రాత్రి అని అర్థం. చీకటి అజ్ణానానికి సంకేతం కదా మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది అనే సందేహం రావొచ్చేమో!! అంటే శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ, శివ దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల ద్వారా అజ్ణానం తొలగి జ్ణానమనే వెలుగు ప్రసరిస్తుంది. అందుకే దీనిని మంగళకరం అంటారు. మహాశివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలాన్ని మహా ప్రదోషం అంటారు. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి.   

మహాశివరాత్రి చాంద్రమానం ప్రకారం మాఘమాసం క్రష్ణపక్షం చతుర్దశి నాడు వస్తుంది. మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రతో కలిసి ఉన్నప్పుడు శివుడు లింగాకారంగా ఆవిర్బవించాడని శివపురాణం చెబుతోంది. అందుకే అన్ని శివక్షేత్రాలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది.  

Read also : Photos : శివాలయాలకు ఆధ్యాత్మిక శోభ

నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహాశ్వరాయ
నిత్యాయ శుధ్ధాయ దిగంబరాయ
తస్మైనకారాయ నమ:శివాయ

శివ పంచాక్షరీ మంత్రం ఓం నమ:శివాయలోని ఐదు బీజాక్షరాల్లోని ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంది. 

న కారం బ్రహ్మను

మ కారం విష్ణువును

శి కారం రుద్రుడిని

వ కారం మహేశ్వరుడిని 

య కారం సదాశివుడిని

సూచిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శివ అనే మాటకు మంగళ, క్షేమం, భద్రం, శాంతి అనే అర్ధాలు ఉన్నాయి.  ప్రతీ వ్యక్తి కోరుకునే ఈ ప్రయెజనాలను ఈ భావాలను ఆశించటం, ఆశ్రయించటం మనలో ఈ గుణాల్ని వృద్ది చేసుకోవటమే శివోపాసన అవుతుంది.      

Read also : Happy Shivaratri 2020: వేయి స్తంభాల గుడిలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు

దేవుడిని పూజించే సమయంలో దైవాన్ని కోరుకునే విధానం ఎలా ఉండాలంటే...
  
మనం బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు మన సంపాదనతో చేయాలి అని కోరుకోవాలి. ఈ కోరికకు అర్థం ఏంటంటే.. ఎప్పుడూ మనం సొంతంగా ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉండాలి అని అర్ధం. ఇంకా చెప్పాలంటే.. ఎప్పటికీ మన దగ్గర సంపద ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది కనుక అలాంటి కోరికలు కోరుకోవచ్చన్న మాట.

'మన ఇంట్లో దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి' అని కోరుకోవాలి. అంటే మన ఇంట్లో ధాన్యం ఎప్పడూ నిలువ ఉంటుందన్న మాట.

మన ఇంట్లో నేను నిత్యం పూజ చేయాలి అని కోరుకోవాలి. మనం ఆరోగ్యం బాగుండి, ఎప్పుడూ ఆనందంగా ఉంటేనే నిత్యపూజ సాధ్యపడుతుంది కనుక ఆ దేవుడిని నిత్యం కొలిచే భాగ్యం ప్రసాదిస్తే చాలు తండ్రీ అని వేడుకోవచ్చన్నమాట.

మన ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి. అంటే మీకు అనుకూలవతి అయిన ధర్మపత్ని, పతి భాగస్వామి అవుతారు. ఈ కోరికలో ఉన్న మర్మం ఏంటంటే.. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు మరొకరికి అనుకూలంగా లేకపోయినా.. ఇంటికి వచ్చే అతిథులందరికీ అతిథి మర్యాదలు చేయలేం. అలా కాకుండా అందరికీ అతిథిమర్యాదలు చేసే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవుడిని కోరుకోవడమంటే... మీ జీవిత భాగస్వామి మీకు సైతం అనుకూలంగా ఉండేలా చూడమని ఆ దేవుడిని కోరుకోవడమే అవుతుంది. 

నేను నా చివరి దశ వరకు నీ క్షేత్ర దర్శనానికి రావాలి అని కోరుకోవాలి. అంటే నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగడటమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

భాగవతులతో మన గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి. అంటే మనకు సమాజంలో తగిన గౌరవం, స్థానం, కీర్తిప్రతిష్టలు రావాలి అని కోరుకోవడమే.  

కుటుంబసమేతంగా సంతోషంగా మీ క్షేత్ర దర్శనానికి రావాలి అని దైవాన్ని కోరుకోవాలి. మనం ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబంతో అన్యోణ్యంగా కలిసి ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. ఇంక ఈ జీవితానికి ఎవరికైనా ఇంతకన్నా ఎక్కువ ఎమి కావాలి చెప్పండి.

సర్వేజనాస్సుఖినో భవంతు
లోకాసమస్తా సుఖినో భవంతు

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News