Maharashtra Landslide: భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు, 11 మంది మృతి

Heavy Rains Maharashtra: భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇళ్ల పైకప్పు, గోడలు కుప్పకూలడంతో అందులో నివసిస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2021, 10:00 AM IST
Maharashtra Landslide: భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు, 11 మంది మృతి

Maharashtra Landslide: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారీ ప్రమాదం సంభవించడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని  చెంబూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి పడటంతో ప్రమాదం జరిగింది.

గత కొన్ని రోజులుగా మహారాష్ట్రను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంబూరు భరత్‌నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇళ్ల పైకప్పు, గోడలు కుప్పకూలడంతో అందులో నివసిస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు తెలిపారు. స్థానికులు, పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గోడలు, శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Also Read: Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 18 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై నగరంలోని విఖ్రోలీలో ఓ రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. బీఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా పాత ఇళ్లు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై ప్రజలను అధికారులు హెచ్చరించారు. పాత ఇల్లు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండరాదని సూచించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News