పబ్‌జి గేమ్ తెచ్చిన తంట.. కాబోయే బావమరిదిపై కత్తితో దాడి !

కాబోయే బావమరిదిపై కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తి

Last Updated : Feb 17, 2019, 12:30 PM IST
పబ్‌జి గేమ్ తెచ్చిన తంట.. కాబోయే బావమరిదిపై కత్తితో దాడి !

థానె: పబ్‌జి గేమ్ రాన్రాను ఓ వ్యసనంలా మారి చిన్నారులను, యువతను బలి తీసుకుంటోందనే ఆందోళనలు రేకెత్తుతున్న ప్రస్తుత తరుణంలోనే తాజాగా మరో దాడి ఉదంతం వెలుగుచూసింది. తన మొబైల్ ఫోన్‌‌లో పబ్‌జి గేమ్ అడుతూ బ్యాటరీ పూర్తిగా డ్రెయిన్ అయ్యేలా చేసుకున్న రజ్నిష్ రాజ్‌బర్ అనే ఓ వ్యక్తికి ఆ తర్వాత మొబైల్ ఫోన్ చార్జర్ సైతం లభించలేదు. దీంతో పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ పక్కనే వున్న తనకు కాబోయే భార్య సోదరుడైన ఓం భవ్‌ధంకర్‌పై ఘర్షణకు దిగాడు. ఆ ఘర్షణ కాస్తా పెద్దదిగా మారడంతో కాబోయే బావమరిదిపైనే రజ్నిష్ రాజ్‌బర్ కత్తితో దాడికి పాల్పడిన వార్త ఆలస్యంగా వెలుగుచూసింది. 

మహారాష్ట్రలోని థానె జిల్లా కోల్షెవాడిలో ఫిబ్రవరి 7న జరిగిన ఈ ఘటనపై గురువారం నాడు హత్యాయత్నం కింద కేసు నమోదైనట్టు థానె పోలీసులు శనివారం తెలిపారు. రజ్నిష్ రాజ్‌బర్‌పై కేసు నమోదైంది కాని ఇప్పటివరకు అతడిని మాత్రం అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.

Trending News