Madhya Pradesh: దేశవ్యాప్తంగా ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. పసి బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఎవరినీ వదలట్లేదు కామాంధులు. తాజాగా నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నీచుడు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారాని(Rape)కి ఒడిగట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని రేవా జిల్లా(Rewa district)లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
Also Read: Obscene Dance in Pub: పబ్ లో అశ్లీల నృత్యాలు.. 9 మంది మహిళలు అరెస్ట్
ఆదివారం సాయంత్రం చిన్నారి ఆడుకుంటుంది. పొరుగున ఉండే ఓ యువకుడు మాయమాటలు చెప్పి... ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడి ఇంటిని నుంచి బయటకు వచ్చిన చిన్నారి..బాధతో విలపిస్తూ.. తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పింది. దీంతో తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదు చేశారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook