రెండు రోజుల క్రితం కర్ణాటకలోని మంగళూరు ఎయిర్ పోర్టులో భయానక వాతావరణం కనిపించింది. ఓ దుండగుడు ఇండిగో విమానంలో బాంబుతో ప్రవేశించాడు. మళ్లీ బయటకు వచ్చి మంగళూరు ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసి చెప్పాడు. అదే రోజు ఇండిగో విమానంలో బాంబు స్వాధీనం చేసుకున్న భద్రతా సిబ్బంది... దాన్ని జనావాసాలకు దూరంగా తీసుకువెళ్లారు. విమానంలో పెట్టిన ఓ బ్యాగులో ఐఈడీ బాంబు లభించింది. దాన్ని ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది .. బాంబు స్క్వాడ్ బృందానికి అప్పగించారు. వారు దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ బాంబు పెట్టిన వ్యక్తి కోసం పోలీసులు రెండు రోజులుగా వెతుకుతున్నారు. ఎయిర్ పోర్టు సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని అన్వేషణ ప్రారంభించారు.
IED recovered from a bag at #Mangaluru #airport on 20th January: Suspect Aditya Rao has surrendered in #Bengaluru. Mangaluru police's investigation team is flying to Bengaluru to question him. #Karnataka @TOIBengaluru pic.twitter.com/VAJIrRdIm1
— Kiran Parashar (@KiranParashar21) January 22, 2020
బెంగళూరు పోలీసుల ముందు ప్రత్యక్షం
అనూహ్యంగా అతడు ఇవాళ ఉదయం బెంగళూరులోని పోలీస్ హెడ్ క్వార్టర్ కు చేరుకున్నాడు. ఉదయం 8.30 గంటలకు బెంగళూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతని పేరు ఆదిత్యా రావు. అతడు ఎయిర్ పోర్టు టికెట్ కౌంటర్ వద్ద బ్యాగు పెట్టి వెళ్లిపోయినట్లు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఐతే ఐఈడీ బాంబు ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు..? సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి ఎలా బ్యాగును తీసుకువెళ్లాడు.. ? అతని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి..? ఇంకా ఎక్కడైనా బాంబులు పెట్టాడా..? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు బెంగళూరు పోలీసులు మంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అదిత్యా రావును ప్రశ్నించడానికి బెంగళూరు రానున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..