Manipur CM: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అయితే మణిపూర్ పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరుండి మరీ సమీక్షిస్తున్నారు. సీఎం ను మారుస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అందుకే మణిపూర్ కూడా వెళ్ళారని తెలుస్తోంది. మరో వైపు రాష్ట్రంలో అల్లర్లు సద్దు మణగాలంటే సీఎం ను మార్చడం ఒక్కటే మార్గమని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మణిపూర్‌లో హింస కొనసాగుతోంది. శనివారం నుంచి అక్కడ అల్లర్లు తగ్గడం లేదు. శనివారం రాత్రి సీఎం బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. అర్ధరాత్రి దాటాక జిరిబామ్ పట్టణంలోని పలు నివాసాలు, రెండు ప్రార్థనా మందిరాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. కాగా, ఇటీవల మేతీ వర్గానికి చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురిని కుకీ వర్గీయులు కిడ్నాప్ చేసి హత్య చేయడంతో మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి.
మృతుల్లో 8 నెలల చిన్నారి కూడా ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఇంఫాల్ వెస్ట్ సగోల్ బంద్‌లో ఉంటున్న సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు ఆందోళనకారులు నిరసన చేపట్టారు. ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇండ్లపై దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ఫర్నీచర్‌ను రోడ్డుపైకి తీసుకొచ్చి తగులబెట్టారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్, విష్ణుపూర్, తౌబల్, కాక్చింగ్ జిల్లాలతో పాటు ఇంఫాల్ వ్యాలీలో కర్ఫ్యూ విధించారు. మొత్తం ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండ్లను తగులబెట్టిన 23 మందిని మణిపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి తుపాకులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ప్రభుత్వం తీసుకునే నిర్ణయం.. మణిపూర్ ప్రజలను సంతృప్తి పర్చేలా ఉండాలని మైతీ వర్గానికి చెందిన సివిల్ రైట్స్ గ్రూప్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేకపోతే అల్లర్లు మరింత చెలరేగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కుకీ మిలిటెంట్లను అణిచివేసేలా సైనిక చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు. తమ వర్గానికి చెందిన ఆరుగురిని హత్య చేసినోళ్లను 24 గంట్లలో అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ యాక్ట్ పై మణిపూర్ వాసులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. భద్రతా బలగాలకు విస్తృత అధికారాలు కల్పించే ఈ చట్టాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని కోరారు. లేకపోతే మణిపూర్ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటదని హెచ్చరించారు. కాగా, ఆరు పోలీస్ స్టేషన్లలో విధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ యాక్ట్ ను ఉప సంహరించుకోవాలని కేంద్రాన్ని మణిపూర్ ప్రభుత్వం కోరింది.
మణిపూర్‌లో చెలరేగిన హింసపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని కాంగ్రెస్ అనధికార అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మణిపూర్ వెళ్లి బాధితులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. మణిపూర్ ను బీజేపీ కావాలనే రావణ కాష్టంలా తగులబెట్టేస్తున్నదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. మణిపూ కు కు మోడీ ఎప్పుడెళ్లినా అక్కడి ప్రజలు ఆయన్ను క్షమించరని అన్నారు. అంతేకాదు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. కాగా, ఈ నెల 11న సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో చనిపోయిన యువకుల పోస్టుమార్టం రిపోర్టు లు అందేవరకు వారికి అంత్యక్రియలు చేయబోమని కుకీ జో నేతలు తెలిపారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter.