Manipur: మణిపూర్ ఇంకా నివురుగప్పిన నిప్పే, ఇంటర్నెట్ బ్యాన్ మరోసారి పొడిగింపు

Manipur: దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన మణిపూర్ పరిణామాలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. భద్రతా దళాల మొహరింపుతో నివురు గప్పిన నిప్పులా ఉంది. అందుకే ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్‌పై నిషేధాన్ని మరోసారి పొడిగించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2023, 06:50 AM IST
Manipur: మణిపూర్ ఇంకా నివురుగప్పిన నిప్పే, ఇంటర్నెట్ బ్యాన్ మరోసారి పొడిగింపు

Manipur: మణిపూర్ అల్లర్లు దేశంలో కలకలం రేపాయి. అత్యంత అమానవీయ సంఘటనలకు వేదికగా నిలిచిన మణిపూర్‌లో పరిస్థితి ఇప్పుడిప్పుడే సాధారణమౌతున్నా ఇంకా పూర్తిగా సమసిపోలేదనే చెప్పాలి. నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి ఎప్పుడు రేగుతుందో తెలియడం లేదు. మరోవైపు భద్రతా బలగాల మొహరింపు కొనసాగుతోంది. 

మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస, అల్లర్లలో అత్యంత అమానవీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు యువతుల్ని వివస్త్రల్ని చేసి అంగాలతో ఆడుకుంటూ పైశాచిక ఆనందంతో వందలాది సమూహంతో ఊరేగిస్తూ చేసిన అరాచకపు దృశ్యాల్ని ఇంకా ప్రపంచం మర్చిపోలేదు. మే 3న జరిగినట్టుగా భావిస్తున్న ఈ ఘటన అప్పటికే ఆ రాష్ట్రంలో మూడు నెలలుగా ఇంటర్నెట్ బ్యాన్ ఉండటంతో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ తరువాత సెప్టెంబర్ 23న రాష్ట్రంలో ఇంటర్నెట్ పునరుద్ధరించారు. అయితే ఆ రాష్ట్రంలో తప్పిపోయిన ఇద్దరు యువకుల మృతదేహల ఫోటోలు వెలువడటం, ఆ తరువాత భద్రతా బలగాలతో విద్యార్ధులు ఘర్షణ పడటం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 26న మరోసారి ఇంటర్నెట్ నిషేధించారు. 

రానున్న కొద్దిరోజుల్లో ఇంటర్నెట్ నిషేధాన్ని ఉపసంహరించుకుంటామని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటన తరువాత ఇంటర్నెట్ నిషేధాన్ని అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టే ఫోటోలు, విద్వేష పూరిత ప్రసంగాలు, వీడియోలు వ్యాపింపచేసేందుకు కొన్ని వర్గాలు సోషల్ మీడియాను వేదికగా చేసుకోవచ్చనే భయంతో ఇంటర్నెట్‌పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇంకా నిరసనలు, ఘర్షణలు కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ స్పష్టం చేశారు. 

ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం ద్వారా అసత్య ప్రచారాలు, పుకార్లు వ్యాప్తి చేయకుండా నియంత్రించవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇంటర్నెట్ నిలిపివేతతో దేశ వ్యతిరేక, అసాంఘిక శక్తుల్ని అడ్డుకోవడమే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల్ని, మత సామరస్యాన్ని కాపాడవచ్చని, ఆస్థి, ప్రాణనష్టం నివారించవచ్చని మణిపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Also read: ED Raids: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్, ముఖ్యమంత్రి కుమారుడికి ఈడీ నోటీసులు, విస్తృత సోదాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News