ఇకపై రైళ్లలో మసాజ్ సేవలు

రైలు ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడం కోసం ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్న భారతీయ రైల్వే తాజాగా మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. 174 ఏళ్ల భారతీయ రైల్వే చరిత్రలో ఇంతకుముందెప్పుడూ లేని విధంగా రైళ్లలో మసాజ్ సేవలను ప్రవేశపెట్టేందుకు రైల్వే ప్లాన్ చేస్తోంది.

Last Updated : Jun 8, 2019, 08:10 PM IST
ఇకపై రైళ్లలో మసాజ్ సేవలు

రైలు ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడం కోసం ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్న భారతీయ రైల్వే తాజాగా మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. 174 ఏళ్ల భారతీయ రైల్వే చరిత్రలో ఇంతకుముందెప్పుడూ లేని విధంగా రైళ్లలో మసాజ్ సేవలను ప్రవేశపెట్టేందుకు రైల్వే ప్లాన్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బయల్దేరే రైళ్లలో మాత్రమే ఈ మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రానున్న 15-20 రోజులలో 39 రైళ్లలో మసాజ్ సేవలు ప్రారంభించనున్నారు. 

15-20 నిమిషాల నిడివిగల ఈ మసాజ్ సేవలకు గోల్డ్ ప్యాకేజ్ కింద రూ.100, డైమండ్ ప్యాకేజ్ కింద రూ.200, ప్లాటినం ప్యాకేజ్ కింద రూ.300ల చొప్పున చార్జ్ చేయనున్నారు. మసాజ్ సేవల ద్వారా ఇండియన్ రైల్వేకు ఏడాదికి అధనంగా రూ.20 లక్షల ఆదాయం సమకూరనుందని తెలుస్తోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మసాజ్ సేవలు లభించవని అధికారులు తెలిపారు.

Trending News